పవన్ మా ఇంటికి వస్తే అవి అడిగి మరీ తింటారు.. త్రివిక్రమ్ భార్య ఏమన్నారంటే?

Trivikram Wife Comments About Pawan Kalyan Details, Trivikram, Pawan Kalyan, Pawan Kalyan Trivikram, Director Trivikram, Trivikram Wife, Sowjanya, Trivikram Wife Sowjanya , Pawan Kalyan Movies, Tollywood

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ప్రస్తుతం రోజుకు 3 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.పవన్ త్రివిక్రమ్ మధ్య మంచి అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే.

 Trivikram Wife Comments About Pawan Kalyan Details, Trivikram, Pawan Kalyan, Paw-TeluguStop.com

పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలకు సంబంధించి ప్రత్యక్షంగా, పరోక్షంగా త్రివిక్రమ్ ( Trivikram ) జోక్యం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.త్రివిక్రమ్ భార్య సౌజన్య( Sowjanya ) ఒక సందర్భంలో పవన్ గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.

సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే సౌజన్య పవన్ మా ఇంటికి వస్తే మా వారు, పవన్ కళ్యాణ్ కబుర్లు చెప్పుకుంటారని కామెంట్లు చేశారు.పురాణాల గురించి, తత్వ శాస్త్రం గురించి వాళ్లిద్దరి మధ్య మాటలు ఉంటాయని సౌజన్య అన్నారు.

వాళ్లు మాటలు మాట్లాడుతూ చుట్టూ ఏం జరుగుతుందో కూడా మరిచిపోతారని ఆమె కామెంట్లు చేశారు.పవన్ త్రివిక్రమ్ మధ్య మంచి స్నేహం ఉందని సౌజన్య పేర్కొన్నారు.

Telugu Trivikram, Pawan Kalyan, Pawankalyan, Sowjanya, Tollywood-Movie

మా ఆయనకు పుస్తకాలు అంటే ఎంతో ఇష్టమని ఆ పుస్తకాలు ఎవరైనా అడిగినా ఇవ్వరని అయితే పవన్ అడిగితే మాత్రం వెంటనే ఇచ్చేస్తారని ఆమె చెప్పుకొచ్చారు.పుస్తకాలు, పెన్నులను ఒకరికొకరు బహుమతులుగా ఇచ్చుకుంటారని సౌజన్య అభిప్రాయం వ్యక్తం చేశారు.మా ఇంటి వంట అంటే పవన్ కు చాలా ఇష్టమని ఆమె తెలిపారు.ఉప్మా అడిగి మరీ పవన్ చేయించుకుంటారని సౌజన్య చెప్పుకొచ్చారు.

Telugu Trivikram, Pawan Kalyan, Pawankalyan, Sowjanya, Tollywood-Movie

మధ్యాహ్నం భోజనంతో పాటు ఆవకాయ, వెజ్ వంటకాలను పవన్ ఇష్టంగా తింటారని ఆమె కామెంట్లు చేశారు.మా ఇంట్లో మనిషిలా పవన్ కలిసిపోతారని అస్సలు సిగ్గు పడకుండా పవన్ ఏం కావాలన్నా అడుగుతారని సౌజన్య పేర్కొన్నారు.రవ్వలడ్డు, ఊరగాయలను పవన్ అడిగి మరీ తింటారని ఆమె తెలిపారు.ఈ మధ్య కాలంలో సౌజన్య పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.

సౌజన్య ప్రొడ్యూసర్ గా మరింత సక్సెస్ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.సౌజన్య నిర్మాతగా కూడా మంచి లాభాలను సొంతం చేసుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

క్లాసికల్ డ్యాన్సర్ గా సౌజన్య మంచి పేరును సంపాదించుకున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube