ఎండల దెబ్బకు నీరసం విపరీతంగా వేధిస్తుందా? అయితే వెంటనే దీన్ని డైట్ లో చేర్చుకోండి!

వేసవికాలం రానే వచ్చింది.ఎండలు ఊపందుకున్నాయి.

ఉదయం 10 గంటలు దాటిందంటే చాలు భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేక చాలామంది ఇళ్లలో నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు.

అయితే ఎండల దెబ్బకు చాలామంది విపరీతమైన నీరసం తో ఎంతో ఇబ్బంది పడుతుంటారు.

నీరసం( Boredom ) వల్ల ఏ పని చేయలేక సతమతం అవుతుంటారు.మీరు కూడా ఎండల దెబ్బకు విపరీతమైన నీరసంతో బాధపడుతున్నారా.? అయితే అస్సలు వ‌ర్రీ అవ్వకండి.వెంటనే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ను డైట్ లో చేర్చుకోండి.

ఈ జ్యూస్ ఎంతటి నీరసాన్ని అయినా చాలా వేగంగా తరిమి కొడుతుంది.బాడీని సూపర్ యాక్టివ్ గా మారుస్తుంది.

Advertisement

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ హలీమ్ విత్తనాలు ( Haleem seeds )వేసి ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరొక గిన్నెలో ఐదు బాదం పప్పులు( Almonds ) వేసి వాటర్ పోసి నాన‌బెట్టుకోవాలి.ఇంకొక గిన్నెలో మూడు గింజ తొలగించిన ఎండు ఖర్జూరాలు, రెండు డ్రై ఆప్రికాట్స్ వేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు ఒక యాపిల్ తీసుకుని వాటర్ లో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ లో కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, నైట్ అంతా నానబెట్టి పొట్టు తొలగించిన బాదం, ఎండు ఖర్జూరాలు, డ్రై ఆప్రికాట్స్ వేసుకోవాలి.అలాగే అర కప్పు వేయించిన ఫూల్ మఖానా మరియు ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్ల తేనె, నైట్ అంతా నానబెట్టుకున్న హలీమ్ విత్తనాలు, వన్ టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, వన్ టేబుల్ స్పూన్ పొద్దుతిరుగుడు విత్తనాలు వేసి సేవించడమే.ఈ జ్యూస్ ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటుంది.రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ జ్యూస్ ను తీసుకుంటే ఎంతటి నీరసం అయినా దెబ్బకు పరారవుతుంది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

బాడీ సూపర్ ఎనర్జిటిక్ గా మారుతుంది.ప్రస్తుత వేసవి కాలంలో రోజంతా శక్తివంతంగా మరియు ఉత్సాహంగా ఉండడానికి ఈ జ్యూస్ చాలా ఎఫెక్టివ్‌ గా సహాయపడుతుంది.

Advertisement

తాజా వార్తలు