వినాయక్‌ తర్వాత త్రివిక్రమ్‌తోనా?

అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ మొదటి సినిమా ఎట్టకేలకు ప్రారంభం అయిన విషయం తెల్సిందే.

ఎన్నో జాగ్రత్తలు తీసుకుని, ఎన్నో కథలను పరిశీలించి, ఎందరినో దర్శకులతో సంప్రదింపులు జరిపి చివరకు వినాయక్‌ చేతిలో అఖిల్‌ను పెట్టాలనే నిర్ణయానికి అక్కినేని ఫ్యామిలీ వచ్చేసింది.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.జనవరిలో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది.

ఇక మొదటి సినిమా ఇంకా సెట్స్‌ పైకి వెళ్లకుండానే అప్పుడే రెండవ సినిమా గురించిన చర్చలు కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.అఖిల్‌ రెండవ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా చేస్తోన్న త్రివిక్రమ్‌ ఆ తర్వాత ఏ హీరోతో చేసేది అనే విషయంలో క్లారిటీ లేదు.అయితే ఫిల్మ్‌ సర్కిల్స్‌ నుండి అందుతున్న సమాచారం ప్రకారం అఖిల్‌తో ఒక సినిమా చేసేందుకు దర్శకుడు త్రివిక్రమ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Advertisement

స్టార్‌ హీరోలు సైతం త్రివిక్రమ్‌తో సినిమా చేసేందుకు పడిగాపులు పడుతున్నారు.అయితే ఈయన మాత్రం అఖిల్‌తో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు.

అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు అనేది మాత్రం ఇప్పట్లో తేలేలా లేదు.

Advertisement

తాజా వార్తలు