సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్యనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా స్టార్ట్ చేసాడు.ముచ్చటగా మూడవసారి వీరి కాంబో సెట్ అయ్యింది.
ఇప్పటికే అతడు, ఖలేజా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కడంతో హ్యాట్రిక్ సినిమాగా ఇప్పుడు మరో సినిమా రాబోతుంది.దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగి పోయాయి.
అందులోను సర్కారు వారి పాట వంటి ఘన విజయం సాధించిన తర్వాత మహేష్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు పెరిగి పోయాయి. SSMB28 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే రెగ్యురల్ షూట్ స్టార్ట్ అయ్యింది.
ఫస్ట్ షెడ్యూల్ లోనే యాక్షన్ సన్నివేశాలతో స్టార్ట్ అయ్యింది.రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయ్యింది.ఇక కొద్దీ రోజులు బ్రేక్ ఇచ్చి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చెయ్యాలని అనుకున్నారు.
కానీ ఈ లోపులోనే మహేష్ బాబు తల్లి గారు మరణించడంతో భారీ గ్యాప్ వచ్చింది.
ఇక ఇటీవలే మహేష్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాడు.కానీ ఇప్పట్లో ఈ సినిమా స్టార్ట్ అయ్యేలా కనిపించడం లేదు.అసలు దీనికి కారణం ఏంటంటే త్రివిక్రమ్ ఇంకా మహేష్ కు ఫైనల్ డ్రాఫ్ట్ ను వినిపించలేదట.అందుకే ఈ మూవీ షూట్ ఆలస్యం అవుతుంది అంటూ కొత్త వార్త వైరల్ అవుతుంది.

అయితే రీసెంట్ గా ఫైనల్ డ్రాఫ్ట్ ను మహేష్ కు వినిపించాడట.కానీ నెక్స్ట్ షెడ్యూల్ కోసం పూజా హెగ్డే తప్పనిసరిగా ఉండాలట.కానీ ఈమె కాలికి గాయం అవ్వడంతో ఈమె ప్రెజెంట్ రెస్ట్ లో ఉంది.దీంతో ఈమె డిసెంబర్ వరకు సెట్స్ లో అడుగు పెట్టె అవకాశం లేదు.
ఈ క్రమంలోనే మహేష్ నెక్స్ట్ షెడ్యూల్ ను డిసెంబర్ లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.ఇక ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.
ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.







