బ్రో మూవీని ఫాలో అవుతున్న త్రివిక్రమ్...

సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో మహేష్ బాబు( Mahesh Babu ) లాంటి స్టార్ హీరో చేసే సినిమాల మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉంటాయి.

ఎందుకంటే ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలు వరుసగా 100 కోట్లకి పైన వసూలు చేశాయి కాబట్టి ఇప్పుడు వచ్చే సినిమా మీద మంచి వసూళ్లను సాధిస్తుంది అని ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉంటాయి.

అయితే ఆయన ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా షూటింగ్ పూర్తయితే మహేష్ బాబు నెక్స్ట్ రాజమౌళితో చేయబోయే సినిమా మీద ఫోకస్ పెట్టనున్నట్లు గా తెలుస్తుంది.

అయితే గుంటూరు కారం సినిమా( Guntur Kaaram )లో ఇంతకుముందు మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో లో వచ్చిన అతడు సినిమాలోని కొన్ని సీన్స్ ని స్పూఫ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఆ సీన్లు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది..మహేష్ బాబు లాంటి ఒక సూపర్ స్టార్ సినిమాలో ఆయన గత చిత్రాలకు సంబంధించిన స్పూఫ్స్ వాడడం కరెక్టేనా అని ఆయన అభిమానులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకుముందు పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ ముందు సినిమాలకు సంబంధించిన కొన్ని రిఫరెన్సులు ఆ సినిమాలో తీసుకోవడం జరిగింది.

Advertisement

అయితే ఆ సినిమాకి త్రివిక్రమ్ రైటర్ కావడం వల్ల పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) క్రేజ్ మైండ్ లో పెట్టుకుని అలాంటి రిఫరెన్స్ లతో కూడిన సీన్లని డిజైన్ చేశాడు అవి థియేటర్ లో సినిమా చూస్తున్న ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి అయితే అదే దారిలో మహేష్ బాబుకు సంబంధించిన పాత హిట్ సినిమాల రిఫరెన్స్ లను గుంటూరు కారం సినిమాలో తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.పవన్ కళ్యాణ్ విషయంలో వర్కౌట్ అయినట్టుగా అలాంటి సీన్లు మహేష్ బాబు విషయంలో కూడా వర్కౌట్ అవుతాయా అనేది చాలామంది అడుగుతున్న ఒక క్వశ్చన్ అనే చెప్పాలి.చూడాలి మరి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas )ఏ విధంగా ఆ రిఫరెన్స్ లను సినిమాలో పెట్టి మెప్పిస్తాడో.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు