Trisha : స్టార్ హీరో అజిత్ వల్ల ఆ విషయంలో ఇబ్బందులు పడుతున్న త్రిష.. ఏం జరిగిందంటే?

తెలుగు ప్రేక్షకులకు చెన్నై బ్యూటీ త్రిష( Trisha ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.త్రిష ప్రస్తుతం తమిళం, హిందీ భాషల్లో వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Trisha Krishnan Movie Chance Issue-TeluguStop.com

తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి మెప్పించింది త్రిష.ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ కథ( lady oriented story ) సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.

నాలుగు పదుల వయసు దాటినా కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అవకాశాలను కూడా అందుకుంటోంది.ఇంకా త్రిష పెళ్లి కాలేదు అన్న విషయం మనందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ఇటీవల ఈమెకు అవకాశాలే లేక ఇంట్లో కూర్చున్న ఈ బ్యూటీకి నాలుగు పదుల వయసు మీద పడ్డ తర్వాత ఇటీవల పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంతో దర్శకుడు మణిరత్నం నటిగా పునర్‌ జన్మను ఇచ్చారనే చెప్పాలి.అలా త్రిష మళ్లీ పీక్‌లోకి వచ్చారు.ఆ తర్వాత విజయ్‌తో జతకట్టిన లియో( leo ) చిత్రం మంచి వసూళ్లు సాధించింది.ప్రస్తుతం అజిత్‌( Ajith ) సరసన విడాముయర్చి, కమలహాసన్‌కు జంటగా థక్స్‌లైఫ్‌ చిత్రాల్లో నటిస్తున్నారు.

అదేవిధంగా చాలా గ్యాప్‌ తర్వాత తెలుగులో చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటించే అవకాశం వచ్చినదన్నది తాజా సమాచారం.

ఈమె ఇంతకుముందు స్టాలిన్‌ చిత్రంలో చిరంజీవితో జత కట్టింది.ఇలా వరుసగా అవకాశాలు వెల్లువెత్తడంతో త్రిష పరిస్థితి అతివృష్టిగా మారింది.ఎందుకు ప్రధాన కారణం అజిత్‌ సరసన నటిస్తున్న విడాముయర్చి చిత్రం ( Vidamuerchi movie )అని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ఈ చిత్ర షూటింగ్‌ అనుకున్న ప్రకారం జరగకపోవడంతో త్రిషకు తలనొప్పిగా మారిందట.ఇతర చిత్రాలకు కేటాయించిన కాల్‌షీట్స్‌కు ఆటంకం కలుగుతోందని త్రిష వాపోతున్నారట.అలా అజిత్ విషయంలో హీరోయిన్ త్రిష ఇబ్బందులు పడుతుందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube