ఏపీ అధికార పార్టీ వైసీపీని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్న టిడిపి, జనసేన లు ఆ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల కంటే దీటుగా బలమైన నేతలను పోటీలో దించేందుకు ప్రయత్నిస్తున్నాయి .టిడిపి, జనసేన పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించాలనే విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు,( Chandrababu ) జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చర్చించుకున్నారు.
ఈ సందర్భంగా జనసేనకు 23 అసెంబ్లీ, మూడు లోక్ సభ స్థానాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే అధికారికంగా జనసేనకు టిడిపి ఎన్ని సీట్లు కేటాయించిందనేది క్లారిటీ లేనప్పటికీ, పవన్ మాత్రం తక్కువ సీట్లు తీసుకునేందుకు సిద్ధమైనట్లుగానే ప్రకటన చేశారు.
ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నాం అనేది ముఖ్యం కాదని, పోటీ చేసిన సీట్లలో తప్పకుండా గెలుస్తామా లేదా అన్నదే ముఖ్యమని, టిడిపితో( TDP ) పొత్తులో భాగంగా జనసేన తీసుకోబోతున్న సీట్లలో 98% గెలుస్తామని పవన్ ధీమా వ్యక్తం చేశారు.వాస్తవంగా పవన్ కళ్యాణ్ 175 అసెంబ్లీ స్థానాల్లో 35 స్థానాలను జనసేనకు కేటాయించాల్సిందిగా చంద్రబాబును కోరినా, 23 సీట్లు మాత్రమే ఇచ్చేందుకు సిద్ధమయ్యారట.

ఈ మేరకు జనసేన( Janasena ) పోటీ చేయబోయే నియోజకవర్గాల సంబంధించి మీడియాకు లీకులు సైతం అందాయి.వాటి ప్రకారం చూసుకుంటే.తెనాలి,( Tenali ) భీమిలి,( Bheemili ) నెల్లిమర్ల, విశాఖనార్త్ లేదా సౌత్, చోడవరం లేదా అనకాపల్లి ,పెందుర్తి ,పిఠాపురం, కాకినాడ ,రాజోలు, పి గన్నవరం ,రాజానగరం, రాజమండ్రి రూరల్ ,అమలాపురం ,నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు లేదా కైకలూరు, దర్శి, పెడన, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, రాజంపేట, తిరుపతి లేదా చిత్తూరు.

లోక్ సభ నియోజకవర్గాల విషయానికొస్తే.మచిలీపట్నం, కాకినాడ, అనకాపల్లి లేదా తిరుపతి స్థానాలను జనసేనకు కేటాయించినట్లుగా ప్రచారం జరుగుతుంది.అయితే దీనిపై అధికారిక ప్రకటన రెండు పార్టీల నుంచి వెలువడాల్సి ఉంది.
జనసేన కు టీడీపీ తక్కువ సీట్లను కేటాయించింది అంటూ అప్పుడే జనసేన నాయకులు కొందరు బహిరంగంగా అసంతృపితిని వ్యక్తం చేస్తున్నా.ప్రస్తుత పరిస్థితుల్లో అవేవి పట్టించుకోకూడదు అనే అభిప్రాయంతో జనసేన పార్టీ ఉంది.