Trisha : స్టార్ హీరో అజిత్ వల్ల ఆ విషయంలో ఇబ్బందులు పడుతున్న త్రిష.. ఏం జరిగిందంటే?

తెలుగు ప్రేక్షకులకు చెన్నై బ్యూటీ త్రిష( Trisha ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

త్రిష ప్రస్తుతం తమిళం, హిందీ భాషల్లో వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి మెప్పించింది త్రిష.ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ కథ( Lady Oriented Story ) సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.

నాలుగు పదుల వయసు దాటినా కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అవకాశాలను కూడా అందుకుంటోంది.

ఇంకా త్రిష పెళ్లి కాలేదు అన్న విషయం మనందరికీ తెలిసిందే. """/" / ఇది ఇలా ఉంటే ఇటీవల ఈమెకు అవకాశాలే లేక ఇంట్లో కూర్చున్న ఈ బ్యూటీకి నాలుగు పదుల వయసు మీద పడ్డ తర్వాత ఇటీవల పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంతో దర్శకుడు మణిరత్నం నటిగా పునర్‌ జన్మను ఇచ్చారనే చెప్పాలి.

అలా త్రిష మళ్లీ పీక్‌లోకి వచ్చారు.ఆ తర్వాత విజయ్‌తో జతకట్టిన లియో( Leo ) చిత్రం మంచి వసూళ్లు సాధించింది.

ప్రస్తుతం అజిత్‌( Ajith ) సరసన విడాముయర్చి, కమలహాసన్‌కు జంటగా థక్స్‌లైఫ్‌ చిత్రాల్లో నటిస్తున్నారు.

అదేవిధంగా చాలా గ్యాప్‌ తర్వాత తెలుగులో చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటించే అవకాశం వచ్చినదన్నది తాజా సమాచారం.

"""/" / ఈమె ఇంతకుముందు స్టాలిన్‌ చిత్రంలో చిరంజీవితో జత కట్టింది.ఇలా వరుసగా అవకాశాలు వెల్లువెత్తడంతో త్రిష పరిస్థితి అతివృష్టిగా మారింది.

ఎందుకు ప్రధాన కారణం అజిత్‌ సరసన నటిస్తున్న విడాముయర్చి చిత్రం ( Vidamuerchi Movie )అని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ఈ చిత్ర షూటింగ్‌ అనుకున్న ప్రకారం జరగకపోవడంతో త్రిషకు తలనొప్పిగా మారిందట.ఇతర చిత్రాలకు కేటాయించిన కాల్‌షీట్స్‌కు ఆటంకం కలుగుతోందని త్రిష వాపోతున్నారట.

అలా అజిత్ విషయంలో హీరోయిన్ త్రిష ఇబ్బందులు పడుతుందట.