సౌత్ ఇండియాలో అగ్ర కథానాయికగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి త్రిష.తెలుగు, తమిళ భాషలలో ఎక్కువ సినిమాలు చేసిన త్రిష స్టార్ హీరోలందరితో ఆడిపాడింది.
ప్రస్తుతం ఎక్కువగా లేడీ ఒరియాంటెడ్ కథల మీదనే ఫోకస్ పెట్టి నటిగా తనని తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది.మరో వైపు తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా ఆచార్య సినిమాలో నటిస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.త్రిష కూడా షూటింగ్ లో చిత్ర యూనిట్ తో చేరిపోయింది.
ఇదిలా ఉంటే తాజాగా తన తమిళ సినిమా ప్రమోషన్ సందర్భంగా పెళ్లిపై త్రిష ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ఎప్పుడు, ఎవరిని పెళ్లి చేసుకుంటారు అని మీడియా అడిగిన ప్రశ్నకి సమాధానంగా పెళ్లి విషయంలో తనదే ఫైనల్ డెసిషన్ అని, తనకి కాబోయే వాడి విషయంలో కుటుంబ సభ్యుల జోక్యం ఉండదని, ప్రేమించి పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది.
ఎలాంటి భర్త కావాలని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు తనను చక్కగా చూసుకునేవాడై ఉండాలంది.తనుహీరో కానవసరం లేదని, అందంగా ఉండాల్సిన పని లేదని అంది.ఇక రంగు విషయంలో ఎలాంటి ఆక్షేపణ లేదంది.అయితే మంచి మనసున్నవాడై ఉండాలని చెప్పింది.
తనను అర్థం చేసుకుని బాగాచూసుకోవాలని చెప్పింది.అలాంటి వ్యక్తి తారస పడితే వెంటనే పెళ్లి చేసుకుంటానని త్రిష పేర్కొంది.