అందాల తార త్రిష ఎప్పుడు గ్లామరస్ కథనాయికగానే తన సినీ కెరీర్ ను సాగించింది.నటిగా తనని తానూ నిరూపించుకునే పద్ధతిలో కాకుండా, కమర్షియల్ హీరోయిన్ గానే ఇండస్ట్రీలో ఎదిగింది త్రిష.
గ్లామర్ షో కి కాని, ముద్దు సన్నివేశాలకు కాని ఎప్పుడు అడ్డు చెప్పలేదు.అలాగని ఎప్పుడు హద్దులు కుడా దాటలేదు.
తన పరిధిమేరలోనే అందాలు ఆరబోసింది ఈ చెన్నై బ్యూటి.
అయితే తొలిసారి త్రిష బికినిలో కనిపించబోతోంది.
తమిళ సినిమా అరన్మనై – 2 కోసం త్రిష బికినీ టాప్ వేసింది.ఇటివలే విడుదలైన సినిమా ట్రైలర్ లో ఇలా బికినీ టాప్ లో దర్శనమిచ్చింది త్రిష.
అయితే త్రిష వన్ పీస్ బికినీ లో మెరిసిందా లేక ఏకంగా టు పీస్ బికినిలో కనువిందు చేసిందా తెలుసుకోవాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.
ఈ చిత్రంలో సిద్ధార్థ్ కథానాయకుడిగా నటిస్తున్నాడు.
త్రిషతో పాటు హన్సిక హీరోయిన్ గా చేస్తోంది.సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ నటి ఖుష్బు నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.
జనవరి 29 న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.