మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్న త్రినయని సీరియల్.. నెట్టింట్లో ట్రోల్స్!

దేశం అన్ని రకాలుగా ఎంతో ముందుకు పోతుంది.కానీ మూఢ నమ్మకాల విషయంలో మాత్రం ఇంకా అలాగే ఉందని చెప్పవచ్చు.

ఎందుకో తెలియదు కానీ మంచి విద్యా రంగంలో ఉన్న ప్రజలు కూడా ఇటువంటి మూఢనమ్మకాలకు లొంగిపోతున్నారు.కాలంలో ఎన్ని మార్పులు వచ్చినా కూడా ఈ మూఢనమ్మకాల పీడ మాత్రం అందరిని పట్టుకుంటూనే ఉంది.

నిజానికి మూఢ నమ్మకం అంటే తమని తామే వశించుకోవడం అని అర్ధం.కొందరు ఈ మూఢనమ్మకాలను ఎంతో నమ్మకంగా భావిస్తుంటారు.

ఇటువంటి మూఢనమ్మకాలను నమ్మకపోవడంతో ఏమైనా అరిష్టం జరుగుతుందన్న భయం వాళ్లలో ఉంటుంది.అలా ఇప్పటికి కూడా కొన్నిచోట్ల ఇటువంటి దురాచారమైన మూఢనమ్మకాలు ఉన్నాయి.

Advertisement

వీటి ప్రభావం ఉండదు అని ఎంతోమంది చెప్పినా కూడా ఇప్పటికీ కూడా ఈ మూఢనమ్మకం అనేది పోవట్లేదు.ఇక ఈ మూఢనమ్మకాలను కొన్ని సీరియల్స్ కూడా ప్రోత్సహిస్తున్నాయి.

మామూలుగా సినిమాలలో, సీరియల్స్ లో కొన్ని కొన్ని సన్నివేశాలలో ఇటువంటి మూఢనమ్మకాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఉంటారు.చాలా వరకు వాటిని ప్రేక్షకులు కొట్టి పారేస్తుంటారు.

కానీ కొంతమంది అలా కాదు.టీవీలలో కూడా చెబుతున్నారు కదా అని.అంటే అది వాస్తవమే కదా అంటూ నమ్ముతూ ఉంటారు.అలా ఇప్పటికీ చాలా జరిగాయి అని చెప్పవచ్చు.

ఇక ఈ తరంలో కూడా వస్తున్న సీరియల్స్ లో కూడా మూఢనమ్మకాలు అనే కాన్సెప్టులను తీసుకొని వస్తూ ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారు.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

అవును.ఈ తరం సీరియల్ కూడా అలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నాయి.ముఖ్యంగా జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని అనే సీరియల్ ఈ మూఢనమ్మకాలకు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పవచ్చు.

Advertisement

ఎందుకంటే ఈ సీరియల్ మొత్తం అలాగే సాగుతుంది.ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

జీ తెలుగులో ప్రసారమవుతున్న ఈ సీరియల్ 2022 మార్చిలో ప్రారంభమైంది.అయితే ఈ సీరియల్లో నయని అనే అమ్మాయికి జరగబోయే ప్రమాదం ముందే ఊహించే శక్తి ఉంటుంది.

అంతేకాకుండా ఆమెకు ఆత్మలతో కూడా మాట్లాడే శక్తి ఉంది.అలా హీరో తల్లి చనిపోయి ఉండగా ఆ ఆత్మ నయని తో మాట్లాడుతుంది.

ఇక తన కొడుకు విశాల్ ను రక్షించమని ముందే నయనకు హెచ్చరిస్తుంది.

అలా ఈ సీరియల్ కొత్త కాన్సెప్ట్ తో ప్రసారమవుతుంది.అయితే ఈ సీరియల్ లో మూఢనమ్మకాలకు సంబంధించిన సన్నివేశాలను బాగా చూపిస్తూ ఉంటారు.అయితే శనివారం రోజు ప్రసారమైన ఎపిసోడ్ లో ఈ సీరియల్ లో జరిగిన సన్నివేశాలను గమనించినట్లయితే అందులో బిడ్డ పుట్టిన బాలింతకు పురుడు అంటూ కొన్ని తంతులు చేస్తూ కనిపించారు.

మరోవైపు బిడ్డ చనిపోయిన బాలింతకు తన భర్త వచ్చి తనకు మొహం మీద కాటుక పెట్టి ఒక బట్ట కాల్చి తన వైపు నుండి తీసిన సన్నివేశాన్ని చూపించారు.దీంతో ఈ సీరియల్ ని చూసిన ప్రతి ఒక్కరు ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.

ఇప్పటికీ మూఢనమ్మకాలను ఈ సీరియల్ ప్రోత్సహిస్తుంది అని.ఇలాంటివి పెట్టి ఎవరిని చెడగొడదాము అని చేస్తున్నారు అంటూ ఈ సీరియల్ పై బాగా దుమ్మెత్తిపోస్తున్నారు.

తాజా వార్తలు