ఆ అమ్మాయి.. సక్సెస్‌ అయితేనే బేబమ్మ ఇండస్ట్రీలో కంటిన్యూ అయ్యేది!

ఉప్పెన సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కృతి శెట్టి ఆ సినిమా సూపర్ హిట్‌ అయ్యి మంచి గుర్తింపు తెచ్చి పెట్టడంతో వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తూ వస్తోంది.బేబమ్మ పాత్రలో నటించిన కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు మరియు నాని తో నటించిన శ్యామ్ సింగరాయ్‌ సినిమాలతో కూడా సక్సెస్ దక్కించుకుంది.

 Uppena Heroine Krithi Shetty Last Chance For Tollywood Career ,krithi Shetty,upp-TeluguStop.com

ఆ రెండు సినిమాలు సక్సెస్ అవడం తో మరిన్ని ఆఫర్లు ఈ అమ్మడికి దక్కాయి.కానీ ఈ మధ్య కాలం లో ఈ అమ్మడు నటించగా వచ్చిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.

దాంతో ఈమెకు సక్సెస్ లు భవిష్యత్తులో అయినా దక్కి మళ్లీ బిజీ అవుతుందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Telugu Aaammayi, Krithi Shetty, Sudheer Babu, Tollywood, Top, Uppena-Movie

ఈ సమయంలో సుధీర్ బాబు మోహన కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఆ సినిమా హిట్ అయితేనే కృతి శెట్టి కెరియర్ కంటిన్యూ అవుతుంది.లేదంటే ఆమె కెరియర్ మధ్యలోనే ఆగిపోయినట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఒకవేళ ఆ సినిమా కనుక ఫ్లాప్‌ అయితే కృతి యొక్క ఆఫర్లు తగ్గే అవకాశం ఉంది.టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్న కృతి శెట్టి రెండు మూడు సంవత్సరాల సందడి తోనే ఆగిపోవాల్సి వస్తుంది అంటూ ఆ అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఆ సినిమాకు సంబంధించిన సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.మరి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా ఎంత వరకు సక్సెస్ అవుతుంది.

ఆమె కెరియర్ కి ఎంత హెల్ప్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube