లిక్కర్ పాలసీ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ

ఢిల్లీ లిక్కర్ పాలసీ( Delhi Liquor Policy ) మనీలాండరింగ్ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో( Rouse Avenue Court ) విచారణ జరిగింది.

ఈ మేరకు జైలులో న్యాయవాదులను కలిసేందుకు అదనపు సమయం కావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( CM Arvind kejriwal ) న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఈ క్రమంలోనే వారానికి ఐదు సార్లు లాయర్లను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కేజ్రీవాల్ కోర్టును కోరారు.అయితే అందరికీ ఉన్నట్లుగానే కేజ్రీవాల్ కూ నిబంధనలు ఉంటాయని ఈడీ తెలిపింది.

ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది.ఈ నేపథ్యంలోనే ఈ నెల 9న రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించనుంది.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు