మహిళల ఎలైట్ పోటీల్లో ట్రాంజెండర్లు( Transgenders ) పాల్గొనకుండా వరల్డ్ అథ్లెటిక్స్( World Athletics ) కీలక నిర్ణయం తీసుకుంది.అంతే కాకుండా వరల్డ్ అథ్లెటిక్ లో పాల్గొనే క్రీడాకారుల ప్లాస్మా టెస్టోస్టెరాన్( Plasma testosterone ) అనేది లీటరుకు 2.5 నానోమోల్స్ ఉండాలని స్పష్టం చేసింది.గతంలో అయితే ప్లాస్మా టెస్టోస్టెరాన్ లీటరుకు 5 నానోమోల్స్ వుండేది.
దీనిపై ఓటింగ్ నిర్వహించారు.71 శాతం మంది నిబంధనలు మార్చడానికి అనుకూలంగా ఓటు వేయడంతో వరల్డ్ అథ్లెటిక్స్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.మహిళలు ఆడే అన్ని క్రీడల్లో ట్రాన్స్ జెండర్ లను ఆడించడం సరికాదని.శరీర దారుఢ్యం వల్ల మహిళలపై ట్రాన్స్ జెండర్లు పై చేయి సాధించడం చాలా సులభమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
మహిళలను క్రీడల వైపు ప్రోత్సహించడం కోసం, మహిళలు క్రీడలలో రాణించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు సెబాస్టియన్ కో ( President Sebastian Co )వెల్లడించారు.అంతేకాకుండా ట్రాన్స్ జెండర్స్ పోటీల్లో పాల్గొనడం వల్ల వచ్చే సమస్యలపై ట్రాన్స్ జెండర్ నేతృత్వంలో ఒక టాస్క్ ఫోర్స్ లు కూడా త్వరలో ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

వరల్డ్ అథ్లెట్స్ లో పాల్గొనే మహిళలు ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేసి ఉత్సాహంగా పోటీలో పాల్గొంటే.కేవలం శారీరక దారుఢ్యం కలిగిన ట్రాన్స్ జెండర్ ల చేతిలో ఓడిపోతున్నారని, ఇది సరైన విధానం కాదని వరల్డ్ అథ్లెట్స్ లో పాల్గొనే కొందరు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకవేళ ట్రాన్స్ జెండర్లు వరల్డ్ అథ్లెటిక్స్ లో పాల్గొనాలంటే వారికోసం భవిష్యత్తులో ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని కొందరు మహిళలు అభిప్రాయపడుతున్నారు.గతం లో రెండుసార్లు ఒలింపిక్స్ పథకాలు సాధించిన క్యాస్టర్ సెమెన్యా, 2020లో ఒలంపిక్స్ లో సిల్వర్ పతాకం సాధించిన క్రిస్టీన్ ఎంబోమా లాంటి క్రీడాకారులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది.







