ఆదిలాబాద్ జిల్లాలోని దక్కన్ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల విహార యాత్రలో విషాదం నెలకొంది.అదుపుతప్పిన కారు లోయలో పడింది.
ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
మహారాష్ట్రలోని చిక్కల్ ధర వద్ద అటవీ ప్రాంతంలో సుమారు రెండు వందల మీటర్ల ఎత్తు నుంచి కారు లోయలో పడింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం బాధితులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.మృతుల్లో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులతో పాటు కారు డ్రైవర్ గా పోలీసులు గుర్తించారు.
వీరలో డ్రైవర్ ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలం అర్లి-టి వాసి కాగా ఉద్యోగులు ముగ్గురు జిల్లా కేంద్రంలోని ద్వారకానగర్ కు చెందిన వారని తెలుస్తోంది.అయితే ప్రమాద సమయంలో కారులో మొత్తం ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారని సమాచారం.







