మురికివాడలో వర్షానికి గోడ కూలి మరణించిన ఎన్టీఆర్ హీరోయిన్ ..ఈమె గుర్తుందా ?

సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో అవకాశాలు ఉన్నంతవరకు అందరూ మంచి జీవితాన్ని గడుపుతూ ఉంటారు.కానీ ఎప్పుడైతే అవకాశాలు తగ్గిపోతుంటాయో అప్పుడే ఇక అసలు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.

 Tragedy Ending Of Pathala Bairavi Heroine Malathi Details, Heroine Malathi, Path-TeluguStop.com

ఇలా ఒకప్పుడు ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో బిజీగా గడిపిన వారు సైతం ఆ తర్వాత కాలంలో అవకాశాలు లేక చిత్ర పరిశ్రమకు దూరమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురుకుని దుర్భర జీవితాన్ని గడిపిన వారు చాలా మంది ఉన్నారు అని చెప్పాలి.అలాంటి వారిలో మాలతి కూడా ఒకరు.1926లో ఏలూరు లో జన్మించిన మాలతి భక్త పోతన అనే సినిమా ద్వారా నటిగా పరిచయమైంది.

ఈ సినిమాలో శ్రీనాథుని కూతురు గా నటించి మొదటి తన నటనతో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నారు.

ఆ తర్వాత గాయనిగా కూడా పలు సినిమాల్లో పాటలు పాడి గుర్తింపు సంపాదించారు.తెలుగులో మాత్రమే కాదు కన్నడలో కూడా రాజ్కుమార్ తో కలిసి నటించింది.ఇక ఇదే ఆమెకు కథానాయకిగా చివరి చిత్రం కావడం గమనార్హం.తర్వాత కేవలం సహాయ పాత్రలు మాత్రమే ఆమె తలుపు తడుతూ వచ్చాయి.1951లో పాతాళభైరవి సినిమా విడుదలలో ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది మాలతి.

ఇక ఆ తర్వాత కాలంలో అవకాశాలు లేకపోవడంతో చిన్న పాత్రలు కూడా చేస్తూ వచ్చారు.ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించిన అదే మాలతీ అదే ఎన్టీఆర్ సరసన వదిన, అక్క లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు పాత్రల్లో నటించారు.

అవకాశాలు లేకపోవడంతో ఇంటి రెంట్ కట్టలేక ప్రభాస్ థియేటర్ వెనుక గోడకు ఆనుకుని ఒక రేకుల షెడ్డు వేసుకొని అక్కడే ఉండేవారు.

Telugu Actress Malathi, Bhaktha Pothana, Malathi, Malathitragedic, Prabhas Theat

అయితే ఆ తర్వాత ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగిన ఆమెకు అవకాశాలు మాత్రం రాలేదు ఇక భర్త చనిపోవడంతో పిల్లలు ఎవరూ లేకపోవడంతో ఆమె పరిస్థితి మరింత దుర్భరంగా మారిపోయింది.1979 నవంబర్ 22న వచ్చిన గాలివానకు ప్రభాస్ థియేటర్ గోడ కూలిపోవటంతో మాలతీ చివరికి మరణించారు.అయితే మాలతి తరుచు గుడికి వెళ్తు అక్కడ ఫలహారాలను తినేవారు.

అక్కడి పూజారి రెండు రోజులుగా మాలతి కనిపించకపోవడంతో ఆరా తీయగా చివరికి థియేటర్ గోడ శిధిలాల కింద ఆమె మృతదేహంతో పాటు ఒక పెద్ద పెట్టె కనిపించింది.అందులో ఆమె పాతాళ భైరవి ఫోటోలు ఆమె చేసిన సినిమాల వివరాలు.

దక్కిన షీల్డ్ లు ఉన్నాయి.ఆమె పడిన బాధలు కూడా డైరీలో రాసుకుంది.

ఇవి చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు అని చెప్పాలి.అయితే ఆమె అంత్యక్రియలకు కూడా అటు సినీ పెద్దలు ఎవరు సహాయం చేయలేదన్న వార్తలు అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube