ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంట్లో విషాదం నెలకొంది.మంత్రి సురేష్ మాతృమూర్తి థెరీసమ్మ తుది శ్వాస విడిచారు.85 సంవత్సరాల వయసున్న ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఈ క్రమంలో హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడవటం జరిగింది.
కర్నూల్ ఇంకా ప్రకాశం జిల్లాలో డాక్టర్ ఆదిమూలపు శామ్యూల్ జార్జ్ విద్యాసంస్థలకు థెరీసమ్మ చైర్ పర్సన్ గా రాణించడం జరిగింది.
అంతకుముందు ఉపాధ్యాయురాలుగా బాధ్యతలను నిర్వహించారు.
ఈ క్రమంలో ఆమె హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ప్రాణం విడిచారు.ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మార్కాపురంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
మంత్రి ఆదిమూలపు సురేష్ తల్లి మృతి చెందటంతో పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు.వైసీపీ ప్రముఖ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.







