రిలయన్స్ జియో ట్యాగ్ తొ పోయిన వస్తువులను ట్రాక్ చేసేయండి..!

రిలయన్స్( Reliance ) జియో దొంగలించబడిన, పోయిన వస్తువులను గుర్తించేందుకు ఓసారి కొత్త పరికరాన్ని లాంచ్ చేసింది.ఈ కొత్త పరికరం పేరే జియో ట్యాగ్.

 Track Reliance Jio Tag Lost Items..!  ,  Reliance  ,  Jiotag , Jio Community ,-TeluguStop.com

దీని పని కనిపించని వస్తువులను ట్రాకింగ్ చేసి గుర్తించడం.ఈ జియో ట్యాగ్ కు బ్లూటూత్ జోడిస్తే పోయిన వస్తువులను ఇట్టే ట్రాక్ చేసేస్తుంది.

మనం ఇంట్లో వస్తువులు ఎక్కడంటే అక్కడ పెట్టి మర్చిపోతాం.అవసరం అయినప్పుడు ఎంత వెతికినా ఆ వస్తువులు కనిపించక ఇబ్బంది పడతాం.కాబట్టి ఆ వస్తువులకు జియో ట్యాగ్ తగిలించి ఉంటే వెంటనే ఒక నోటిఫికేషన్ స్మార్ట్ ఫోన్ కు వస్తుంది.ఇండోర్ లో 20 మీటర్లు, అవుట్ డోర్ లో 50 మీటర్ల వరకు ఈ జియో ట్యాగ్ ట్రాక్ చేయగలుగుతుంది.

ఈ జియో ట్యాగ్ లో సీఆర్ 2032 బ్యాటరీ అమర్చబడి ఉంటుంది.ఈ బ్యాటరీకు ఒక ఏడాది వారంటీ ఉంటుంది.ఈ బ్యాటరీని కావాలంటే మార్చుకోవచ్చు.ఈ జియో ట్యాగ్ తో స్మార్ట్ ఫోన్లు కూడా ట్రాక్ చేయవచ్చు.స్మార్ట్ ఫోన్( Smart phone ) సైలెంట్ మోడ్ లో ఉన్నా కూడా రెండుసార్లు జియో ట్యాగ్ తో ట్యాప్ చేస్తే ఫోన్ మోగుతుంది.అంతేకాదు జియో ట్యాగ్ తగిలించి ఉన్న వస్తువులు దొంగలించబడితే.

జియో థింగ్స్ యాప్ లోని జియో కమ్యూనిటీ( Jio Community )లో రిపోర్ట్ చేయాలి.అప్పుడు ఆ పరికరం చివరిసారి నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాన్ని ఫోన్కు నోటిఫికేషన్ ద్వారా తెలియపరుస్తుంది.జియో ట్యాగ్ అసలు ధర రూ.2199 గా ఉంది.అయితే వెల్కమ్ ఆఫర్ కింద రూ.749 కె ట్యాగ్ పొందవచ్చు.ఇక రిలయన్స్ జియో ట్రాకర్, జియో ట్యాగ్ ఒక సంవత్సరం వరకు బ్యాటరీ బ్యాకప్ ను అందించగలరని కంపెనీ తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube