యష్ తెలుగు సినిమాకు లేట్ ఎందుకు..?

కె.జి.ఎఫ్ ( KGF )తో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న యశ్ ఆ సినిమా టైం లో తెలుగు ఆడియన్స్ తన మీద చూపిస్తున్న ప్రేమకు తెలుగులో ఒక స్ట్రైట్ సినిమా చేస్తానని అన్నారు.

కె.

జి.ఎఫ్ 1, 2 వచ్చాయి కె.జి.ఎఫ్ 3 కూడా ఉంటుంది అంటున్నారు అదెప్పుడో మాత్రం తెలియట్లేదు.యష్ తెలుగు సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు.

యష్ తో దిల్ రాజు మెగా మూవీ ప్లాన్ చేసినట్టు చెప్పుకున్నారు.కానీ ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తుంది.

యష్( Yash ) తెలుగులో స్ట్రైట్ సినిమా చేసినా అతనికి ఉన్న పాన్ ఇండియా ఫాలోయింగ్ కి సినిమా రిలీజ్ భారీగానే ఉంటుంది.

Advertisement

కె.జి.ఎఫ్ 2( KGF 2 ) తర్వాత యష్ తన నెక్స్ట్ సినిమానే ఇంకా సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు.కె.జి.ఎఫ్ తో తనకు వచ్చిన క్రేజ్ ని కొనసాగించేలా తన సినిమాలు ఉండాలని ప్లాన్ చేస్తున్నాడు యష్.కానీ అతని ఇమేజ్ కి తగ్గ కథలు దొరకట్లేదని తెలుస్తుంది.తెలుగులో కూడా యష్ కి తగిన కథలను రాయండంటూ ఇక్కడ నిర్మాతలు రైటర్స్ కి చెప్పారట.

సరైన కథ తగిలితే మాత్రం వెంటనే సినిమా చేసే అవకాశం ఉంది.యష్ తెలుగు సినిమా కోసం ఇక్కడ ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు