తెలంగాణలో ఎలక్షన్లకు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉన్నప్పటికీ అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది.ఆరోపణలు ప్రతి ఆరోపణలు ,విమర్శలు ప్రతి విమర్శలతో అప్పుడే తెలంగాణలో ఎన్నికల జోష్ మొదలైంది.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా తీసుకొచ్చిన ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం రాష్ట్రాల వారీగా “హాత్ సే హాత్ “ జోడో యాత్రలు మొదలు పెట్టిన విషయం తెలిసింది.అలాగే తెలంగాణలో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 6 నుంచి ఈ యాత్రను కొనసాగిస్తున్నవిషయం తెలిసింది అయితే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తనకు భద్రత తగ్గిస్తున్నదని ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా తెలంగాణహైకోర్టును రేవంత్ రెడ్డి ఆశ్రయించారు.

ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది.ముందుగా వాదనలు వినిపించిన రేవంత్ రెడ్డి లాయర్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భద్రతను తగ్గించే చర్యలు చేపట్టిందని,ప్రతిపక్ష నాయకుల కార్యక్రమాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ప్రజల్లో అత్యధిక ఆదరణ ఉన్న రేవంత్ రెడ్డి లాంటి నాయకుడికి తగినటువంటి భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైనదని అందువల్ల కోర్టుని ఆశ్రయించామని తెలిపిన న్యాయవాది అందుకు అనుగుణంగా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా హైకోర్టుని అభ్యర్థించారు. ప్రభుత్వ తరపు న్యాయవాదితన వాదనలు వినిపిస్తూ ఇప్పటికే భద్రత పెంచాల్సిందిగా అదనపు డీజీ ఎస్పీలకు లేక పంపారని, రేవంత్ రెడ్డి కు భద్రత తగ్గించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని వివరణ ఇచ్చారు.తగిన భద్రత కల్పిస్తే మనం ఇప్పుడు ఈ పిటిషన్ ఎందుకు విచారణ చేస్తున్నామని ప్రశ్నించిన హైకోర్టు, కల్పించిన భద్రతపై రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా రేవంత్ రెడ్డి న్యాయవాదికి సూచించింది తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది …

ఏది ఏమైనప్పటికీ రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో నూతన కదలికను తీసుకొచ్చినట్లుగా అర్థమవుతుంది అయితే దీన్ని ఎలక్షన్ వరకు ఎలా కొనసాగిస్తారు ముందు ముందు తెలుస్తుంది
.