వైసీపీ పరిపాలనలో ముస్లిం ల పై దాడులు అధికంగా జరుగుతున్నాయని ఇప్పటి వరకు పది మంది ప్రాణాలు కోల్పోగా మరో 45 మంది ఇటువంటి దాడులలో గాయపడ్డారు అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు….” యువగళం ” పాదయాత్ర 32 వ రోజు తిరుపతి దగ్గరలోని పుంగనూరు నియోజకవర్గ పరిధిలో సాగుతుంది… ఈ కార్యక్రమం లో భాగం గా నారా లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వం పై ఘాటైన విమర్శలు గుప్పించారు… అంతే కాకుండా రాజకీయ కారణాలతో ముస్లిం లకు దూదేకుల బీసీ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం లేదని టీడీపీ మళ్ళీ అధికారం లోకి రాగానే దూదేకుల సర్టిఫికేట్ ఇచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు….

అదే విధంగా గా CPS విషయం లోనూ ప్రభుత్వం మాట తప్పిందని,ప్రభుత్వ టీచర్ల సేవలను సమర్థవంతంగా గా వినియోగించుకోకపోగా వారిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు… విద్యా వ్యవస్థలో చేసిన మార్పులు విద్యా ప్రమాణాలు దెబ్బతినేలా ఉన్నాయన్నారు….

గంజాయి సాగు ను అరికట్టడం లో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని, క్షేత్ర స్థాయి లో దాని తీవ్రత చూసిన తర్వాతే దాని పైన ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చారు…ఆధారాలు లేకుండా తాను ఎటువంటి ఆరోపణలు చేయనన్నారు…మార్గం మధ్యలో బందార పల్లె వద్ద రోడ్డు మొత్తం గుంతలు పడటం తో అక్కడ సెల్ఫీ దిగి ప్రభుత్వం కొత్త రోడ్లు వెయ్యడం సంగతి పక్కన పెడితే కేవలం గుంతలు పుడ్చే పని కూడా చెయ్యలేకపోతుంది అని ఎద్దేవా చేశారు….ఈ రకంగా సాగింది ఆయన పాదయాత్ర…
మొత్తానికి లోకేష్ తన పైన ఉన్న పాత నెగటివ్ టాగ్ లను పక్కన పెట్టేలా తన వ్యవహార శైలి లో ,మాటలలో వచ్చిన మార్పు తెలిసేలా ప్రయత్నిస్తున్నారు….విమర్శల్లో వేడి పెంచుతున్నారు….
ప్రజలలో ఇవి ఎంత మేరకు ప్రభావం కలిగిస్తాయో చూడాలి….







