టీపాడ్ ఆధ్వరంలో డల్లాస్ లో ఫుడ్ డ్రైవ్..!!!

అమెరికాలో ఎన్నో తెలుగు సంఘాలు ఉన్నాయి.తెలంగాణా రాష్ట్ర ప్రజలు , ఏపీ రాష్ట్ర ప్రజలు ఎవరికి వారికి విడివిడిగా సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు.

అయితే తెలుగు రాష్ట్రాల వారీగా సంఘాలు ఉన్నా సరే సేవా కార్యక్రమాలు చేపట్టడంలో అందరూ ఒక్కటిగా కలిసికట్టుగా పని చేస్తారు.సమస్యాత్మక పరిష్కారాల కోసం అమెరికాలో ఎన్ని తెలుగు సంఘాలు ఉన్నా సరే అందరూ ఒక్కటై పని చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

ఎవరికి వారు వారి వారి సంఘాల పేర్లతో సేవా కార్యక్రమాలు చేపట్టినా సరే అందులో అందరూ కలిసే పని చేస్తారు.ఈ క్రమంలోనే అమెరికాలోని డల్లాస్ లో తెలంగాణా పజాసమితి (టీపాడ్ ) ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఫుడ్ డ్రైవ్ నిర్వహించారు.

నిరుపేదలకి ఆహారాన్ని అందించే కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు చేపట్టే టీపాడ్ తాజాగా ఆస్టిన్‌ స్ట్రీట్‌ సెంటర్‌లో ఉంటున్న నిరాశ్రయులైన దాదాపు 450 మందికి భోజనాలని పంపిణీ చేశారు.అప్పటికప్పుడు వండిన ఆహారాన్ని తామే స్వయంగా వండి వడ్డించారు.అంతేకాదు వారికి అవసరమైన దుస్తులు, అత్యవసర వస్తువులను కూడా టీపాడ్ సమకూర్చి పెట్టింది.

Advertisement

జాక్ పాట్ కొట్టిన మేస్త్రి.. నెలకు కోటి చొప్పున 30 ఏళ్ల వరకు..

Advertisement

తాజా వార్తలు