పూణేకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టోర్క్ మోటార్స్( Tork Motors ) కొత్త ఎలక్ట్రిక్ బైక్ రిలీజ్ చేసింది.తన పాపులర్ క్రాటోస్-ఆర్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌కు అర్బన్ ఎడిషన్‌ను తాజాగా విడుదల చేసింది.ఈ అర్బన్ ఎడిషన్ బైక్ ధరను రూ.1,67,499 (ఎక్స్-షోరూమ్ పూణే)గా కంపెనీ నిర్ణయించింది.ఈ ధర రూ.1.82 లక్షలు (ఎక్స్-షోరూమ్ పూణె) ధర కలిగిన స్టాండర్డ్ క్రాటోస్-ఆర్ కంటే మరింత చవకైనదని చెప్పవచ్చు.
క్రాటోస్-ఆర్ అర్బన్ ఎడిషన్ బైక్‌ను( Kratos-R Urban Edition ) సిటీ రైడింగ్‌ను దృష్టిలో పెట్టుకొని కంపెనీ లాంచ్ చేసింది.ఇది సిటీ రైడింగ్‌కు అనువైన అనేక ఫీచర్లతో వస్తుంది.70 కి.మీ టాప్ స్పీడ్‌తో ఇది దూసుకెళ్తుంది.దీనిలోని ‘సిటీ’ రైడ్ మోడ్( City Ride Mode ) ద్వారా కొనుగోలుదారులు సౌకర్యమంతమైన రైడ్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు.
దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీల రేంజ్ అందిస్తుంది.ట్రాఫిక్‌లో సులభంగా నడపడానికి వీలు కల్పించే తేలికపాటి డిజైన్‌తో ఈ బైక్ తయారయ్యింది.

క్రాటోస్-ఆర్ అర్బన్ ఎడిషన్ 4.0 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్, ‘యాక్సియల్ ఫ్లక్స్’ మోటార్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లతో కూడా వస్తుంది.అర్బన్ ఎడిషన్ లాంచ్ గురించి టోర్క్ మోటార్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన కపిల్ షెల్కే( Kapil Shelke ) మాట్లాడుతూ, ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా సిటీ రైడర్లకు అద్భుతమైన పర్ఫామెన్స్ అందించడానికి Kratos-R అర్బన్ ఎడిషన్ అందుబాటులోకి తెచ్చామని అన్నారు.

ఎలక్ట్రిక్ బైక్ ( Electric Bike ) కావాలనుకునే సిటీ రైడర్స్ కి Kratos-R అర్బన్ ఎడిషన్ ఉత్తమ ఎంపిక అవుతుందని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు.Kratos-R అర్బన్ ఎడిషన్ బైక్ స్ట్రీకీ రెడ్, ఓషియానిక్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ అనే మూడు రంగులలో అందుబాటులో ఉంది.ఈ బైక్ విక్రయాలు ఆగస్టు 15 నుంచి భారతదేశంలోని అన్ని టోర్క్ ఎక్స్‌పీరియన్స్ జోన్‌లలో ప్రారంభమవుతాయి.