Cheap Electric Scooters : ఇండియాలో చీపెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..

తక్కువ ధరలతో పాటు ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటర్లు, బైక్స్ కోసం ప్రజలు ఎక్కువగా వెతుకుతున్నారు.

అలాంటి వారి కోసం తక్కువ ధరలలోనే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇండియాలో రిలీజ్ చేశారు.

అవేంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం.

• అవాన్ ఈ-స్కూటర్

అవాన్ ఈ-స్కూటర్ ధర రూ.45,000.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 65 కి.మీ వరకు వెళ్లగలదు.గంటకి 25 కిమీ వేగం తో ప్రయాణిస్తుంది.

ఈ స్కూటర్ బ్యాటరీ ఛార్జ్ అవడానికి 6-8 గంటల సమయం పడుతుంది.

• బౌన్స్ ఇన్ఫినిటీ E1

Advertisement

ఇండియా మార్కెట్‌లో బాగా పాపులర్ అయిన వాటిలో బౌన్స్ ఇన్ఫినిటీ E1 స్కూటర్ ఒకటి.ఈ స్కూటర్ ధర రూ.45,099. ఈ స్కూటర్‌ని ఛార్జ్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది.

దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 85 కి.మీ వరకు ప్రయాణించగలదు.అంతేకాకుండా, గంటకు 65 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.

• హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్

ఈ స్కూటర్ ధర రూ.46,640.దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే 85 కిమీ వరకు ప్రయాణించగలదు.

ఈ స్కూటర్ గంటకు 25 కి.మీ వేగంతో వెళ్తుంది.

• అవాన్ ట్రెండ్ ఈ

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
పుత్రికోత్సాహంలో జగన్.. మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసావంటూ ట్వీట్

అవాన్ ట్రెండ్ ఈ-స్కూటర్ ధర రూ.56,900.ఈ స్కూటర్ సింగిల్, డబల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.

Advertisement

సింగిల్ బ్యాటరీ 65 కి.మీ వరకూ ట్రావెల్ రేంజ్ అందిస్తుంది.అదే సమయం లో డబల్ బ్యాటరీ దాదాపు 110 కి.మీ వరకు ట్రావెల్ రేంజ్ అందిస్తుంది.ఈ రెండిటి వేగం గంటకు 45 కి.మీ వరకూ ఉంటుంది.

• ఈవీ అహవా

ఈవీ అహవా స్కూటర్ ధర రూ.62,499.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి ఛార్జ్ చేస్తే 60 నుంచి 70 కిమీ వరకూ ప్రయాణిస్తుంది.

ఇది ఛార్జ్ అవడానికి 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది.ఈ స్కూటర్‌లో లేటెస్ట్ ఫీచర్స్‌ చాలానే ఉన్నాయి.

తాజా వార్తలు