Producer DVV Danayya : ఆర్ఆర్ఆర్ నిర్మాత నిజస్వరూపం ఇదే.. ముక్కుపిండి వసూలు చేస్తాడంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని సక్సెస్ ఫుల్ నిర్మాతలలో డీవీవీ దానయ్య ఒకరు.ఆర్.

 Rrr Producer Danayya Real Behavior Details Here Goes Viral,rrr,dvvv Danayya,dire-TeluguStop.com

ఆర్.ఆర్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడం వల్ల ఈ నిర్మాతకు ఏకంగా 200 కోట్ల రూపాయల లాభం దక్కింది.సక్సెస్ లో ఉన్న డైరెక్టర్లకు అడ్వాన్స్ లు ఇచ్చి లాక్ చేసే ఈ నిర్మాత డైరెక్టర్ ఫ్లాప్ లో ఉంటే మాత్రం ఆ అడ్వాన్స్ ను వెనక్కు అడిగి తీసుకుంటారు.మనీ లెక్కల విషయంలో దానయ్య చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని సమాచారం.
రాజమౌళికి ఎప్పుడో ఇచ్చిన అడ్వాన్స్ వల్ల ఆయనకు ఆర్.ఆర్.ఆర్ కు సోలో నిర్మాతగా పని చేసే అవకాశం ఉంది.పవన్ సుజీత్ కాంబో మూవీకి దానయ్య నిర్మాత అనే సంగతి తెలిసిందే.

అయితే చిరంజీవి వెంకీ కుడుముల కాంబో మూవీకి సైతం దానయ్య నిర్మాతగా వ్యవహరించాల్సి ఉంది.మొదట ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పిన చిరంజీవి ఆ తర్వాత వేర్వేరు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.

Telugu Chiranjeevi, Directors, Dvvv Danayya, Pawan Kalyan, Rrr, Sujith, Venky Ku

అయితే వెంకీ కుడుముల నుంచి వడ్డీతో పాటు అడ్వాన్స్ ను వసూలు చేయాలని దానయ్య ఫిక్స్ అయ్యారని సమాచారం.అడ్వాన్స్ తో పాటు వడ్డీలు, ఈ ప్రాజెక్ట్ కోసం చేసిన ఖర్చు కూడా అడుగుతుండటంతో వెంకీ కుడుముల షాకయ్యారని తెలుస్తోంది.వెంకీ కుడుముల ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించుకునే పనిలో బిజీగా ఉన్నారని సమాచారం అందుతోంది.

గతంలో వెంకీ అట్లూరి, మారుతి, మరి కొందరు డైరెక్టర్లు దానయ్యకు డబ్బులు వెనక్కు ఇచ్చిన జాబితాలో ఉన్నారని బోగట్టా.

నిర్మాత దానయ్య కమర్షియల్ గా ఉండటంలో తప్పు లేదని అయితే మరీ కమర్షియల్ గా ఉండటం మాత్రం తప్పేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.నిర్మాతలు ఈ విధంగా లేకపోతే ఇండస్ట్రీలో సక్సెస్ కాలేరని మరి కొందరు వెల్లడిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube