మెగా డాటర్ నిహారిక సినిమాలలో ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించకపోయినా ఊహించని స్థాయిలో అభిమానులను సొంతం చేసుకుని అభిమానుల అభిమానాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే.ఒక ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ నా పుట్టింట్లో నేను ప్రిన్సెస్ అని అయితే అత్తింట్లో కూడా అదే పరిస్థితి ఉందని ఆమె కామెంట్లు చేశారు.
పెళ్లి గురించి పెళ్లి తర్వాత పరిస్థితుల గురించి నేను ఎక్కువగా థింక్ చేయలేదని నిహారిక అభిప్రాయం వ్యక్తం చేశారు.
పెళ్లైన కొన్ని రోజుల తర్వాత నేను ఇదంతా ఆలోచించలేదేంటి అని అనిపించిందని ఆమె పేర్కొన్నారు.
అతయ్య, మామయ్య చాలా స్వీట్ పర్సన్స్ అని నిహారిక కామెంట్లు చేశారు.అత్తమ్మ ఫుడ్ అని అంటే అత్తమ్మ వచ్చి తినిపిస్తుందని నిహారిక పేర్కొన్నారు.చాలా కేరింగ్ గా ఆమె నన్ను చూసుకుంటారని నిహారిక చెప్పుకొచ్చారు.అత్తయ్య మామయ్య మేము నిన్ను చూసుకుంటాం నువ్వు చైతన్యను చూసుకో అని చెబుతారని ఆమె కామెంట్లు చేశారు.
మా ఇంట్లో మార్నింగ్ పది గంటలకు నిద్ర లేచేదానినని తలుపు కొట్టి నిద్ర లేపేవారని నిహారిక అన్నారు.అత్తారింట్లో మాత్రం అసలు తలుపు కూడా కొట్టరని ఆమె చెప్పుకొచ్చారు.అత్తమ్మకు ఈ విషయంలో కాళ్లు మొక్కాలి అంటూ నిహారిక దండం పెడుతూ ఎక్స్ ప్రెషన్లు ఇచ్చారు.మా నాన్న ఎప్పుడు ఊరికి వెళ్లాలని చెప్పినా పెళ్లయ్యాక వెళ్లమని చెప్పారని నిహారిక అన్నారు.
ఇప్పుడు ట్రావెలింగ్ ఎక్కువగా చేస్తున్నానని ఆమె వెల్లడించారు.
నేను వెరీ గుడ్ సిస్టర్ అని మా అన్నపై ఎప్పుడూ నెగిటివ్ కామెంట్స్ చేయలేదని ఆమె అన్నారు.
నిహారిక ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరిస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.సినిమాల్లో నిహారిక సక్సెస్ కాకపోయినా వెబ్ సిరీస్ లకు నిర్మాతగా మాత్రం ఆమె సక్సెస్ అయ్యారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.