పాదాల ప‌గుళ్ల‌ను టూత్ పేస్ట్‌తో నివారించుకోవ‌చ్చు..ఎలాగంటే?

పాదాల ప‌గుళ్లు. స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎంద‌రినో ఇబ్బంది పెట్టే స‌ర్వ సాధార‌ణ స‌మ‌స్య ఇది.

ముఖ్యంగా ప్ర‌స్తుత సీజ‌న్‌లో ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా వేధిస్తుంటుంది.పొడి గాలి, తేమ సరిగా లేక పోవడం, పాదాల సంర‌క్ష‌ణలో అశ్ర‌ద్ధ‌గా వ్య‌వ‌హ‌రించ‌డం, ఆహార‌పు అల‌వాట్లు, డీహైడ్రేషన్ వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల పాదాలు ప‌గిలి నొప్పి పుడుతుంటాయి.

దాంతో ఒక్కోసారి న‌డ‌వ‌ట‌మే క‌ష్టం అవుతుంటుంది.అందుకే పాదాల ప‌గుళ్ల‌ను వ‌దిలించుకోవ‌డం కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.ఖ‌రీదైన క్రీముల‌ను కొనుగోలు చేసి వాడుతుంటాయి.

అయితే ఎలాంటి ఖ‌ర్చు లేకుండా ఇంట్లోనే టూత్ పేస్ట్‌తోనే పాదాల ప‌గుళ్ల‌ను నివారించుకోవ‌చ్చు.మ‌రి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్‌ స్పూన్ల‌ వైట్ టూత్ పేస్ట్‌, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌, వ‌న్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, వ‌న్ టేబుల్ స్పూన్ లెమ‌న్ జ్యూస్ వేసుకుని అన్నీ క‌లిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు పాదాల‌ను వాట‌ర్‌తో వాష్ చేసుకుని.

ఆ త‌ర్వాత త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని అప్లై చేయాలి.

ఆపై స్మూత్‌గా ఐదారు నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకుని.డ్రై అయ్యే వ‌ర‌కు వ‌దిలేయాలి.ఇప్పుడు గోరు వెచ్చ‌ని నీటితో పాదాల‌ను శుభ్రంగా క్లీన్ చేసి.

ఏదైనా మాయిశ్చ‌రైజ‌ర్ లేదా అలోవెర జెల్‌ను రాసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే గ‌నుక కేవ‌లం కొద్ది రోజుల్లోనే ప‌గుళ్లు త‌గ్గు ముఖం ప‌ట్టి పాదాలు అందంగా మ‌రియు మృదువుగా త‌యారు అవుతాయి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

కాబ‌ట్టి, ఇక‌పై పాదాల ప‌గుళ్ల‌ను నివారించుకోవ‌డం కోసం మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే క్రీముల‌ను వేల‌కు వేల‌కు పెట్టి కొనుగోలు చేసే బ‌ద‌లు.పైన చెప్పిన సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెమెడీని ప్ర‌యత్నిస్తే మంచి ఫ‌లతం ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు