Writer Maharadhi: రాజకీయాల్లో మరో కేఏ పాల్.. పార్టీ పెట్టి బొక్కబోర్లా పడ్డ టాలీవుడ్ మాటల రచయిత

సినిమా ఇండస్ట్రీ, రాజకీయాలకు ఎంతో అనుబంధం ఉంటుంది.సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది రాజకీయాల్లోకి( Politics ) అరంగ్రేటం చేస్తూ ఉంటారు.

 Tollywood Writer Tripuraneni Maharadhi Andhramata Party Failure-TeluguStop.com

వారిలో కొంతమంది సక్సెస్ అవ్వగా.మరికొంతమంది సినిమాల్లో విజయవంతమైనట్లు పాలిటిక్స్‌లో సక్సెస్ సాధించలేక వెను తిరిగినవారు ఉన్నారు.

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) రాజకీయాల్లో ఫెయిల్యూర్ మూటకట్టుకుని మళ్లీ తిరిగి సినిమాల్లోకి వెళ్లిపోయారు.తాను రాజకీయాల్లో సక్సెస్ సాధించలేకపోయానని, అదోక చేదు అనుభవం అని చిరంజీవినే పలుమార్లు బాహాటంగా మీడియా ముందు చెప్పుకొచ్చారు.

రాజకీయాల్లో ఫెయిల్ అయిన విషయాన్ని చిరంజీవి స్వయంగా పరోక్షంగా పలుమార్లు చెప్పారు.ఇక ఎన్టీఆర్, జయలలిత, ఏంజీఆర్ వంటివారు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ మంచి పేరు తెచ్చుకున్నారు.

సీఎంలుగా మంచి పాలన అందించి సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా ప్రజల మెప్పు పొందారు.అలాగే ఓ టాలీవుడ్ మాటల రచయిత కూడా పార్టీ పెట్టాలనుకుని బొక్కబోర్లా పడ్డారు.

ఆయనే మహారథి.( Writer Maharadhi ) హీరో కృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన అల్లూరి సీతారామరాజు సినిమా( Alluri Sitaramaraju Movie ) ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

హీరో కృష్ణకు ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెట్టింది.

Telugu Andhramata, Krishna, Ka Paul, Maharadhi, Tollywood-Movie

ఇక ఈ సినిమాలోని పవర్‌ఫుల్ డైలాగ్‌లు, మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.అవి రాసింది మహారథినే.ఆయన ఆంధ్రమాత( Andhramata ) పేరుతో ఒక పార్టీ పెట్టాలని అనుకున్నారు.

పార్టీ విధానాలు, సిద్దాంతాలు అన్నీ సిద్దం చేసుకున్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ఆయన పార్టీ పెట్టాలని నిర్ణయించారు.

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఉండవంటూ అప్పట్లో చెప్పారు.ఆ రెండు పార్టీలలోని నేతలందరూ తమ పార్టీలో చేరతారని, కాంగ్రెస్, టీడీపీలో ఎవరూ ఉండరని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈయన మరో కేఏ పాల్‌లా( KA Paul ) మాట్లాడుతున్నారని అనుకున్నవారు కూడా లేకపోలేదు.

Telugu Andhramata, Krishna, Ka Paul, Maharadhi, Tollywood-Movie

అల్లూరి సీతారామరాజు సినిమాతో మహారథి మంచి పేరు తెచ్చుకోగా.సినిమా ఇండస్ట్రీ వారికి మాత్రమే ఆయన పేరు తెలుసు.బయట ప్రజలకు ఆయన ఎవరో కూడా తెలియదు.

అలాంటప్పుడు తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ప్రకటించడం చాలామందికి ఆశ్చర్యానికి గురి చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube