Chiranjeevi : డిజాస్టర్స్ ఇప్పటివి కాదు.. చిరంజీవి మృగరాజు నుంచి ఏజెంట్ వరకు అన్నీ అవే?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో తరచూ విభిన్న కథలతో అనేక సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి.అయితే అందులో కథ కథనం బాగుంటే కొన్ని సినిమాలు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే మరికొన్ని సినిమాలో ఫ్లాప్ గా నిలుస్తూ ఉంటాయి.

 Tollywood Unforgettable Disaster Movies-TeluguStop.com

అయితే తెలుగులోనే కాకుండా ఇండియన్ సినిమాలోనే డిజాస్టర్ కథలు ఎప్పటి నుంచో ఉన్నాయి.కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కించడం అవి కాస్త బోల్తా కొట్టడంతో నిర్మాతలు కోట్లలో డబ్బులు లాస్ అవుతున్నారు.

అలా నిర్మాతలు కొట్లలో డబ్బులు పోగొట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు.

Telugu Akhil, Balakrishna, Chiranjeevi, Disaster, Nithin, Tollywood-Movie

గత ఏడాది విడుదల అయినా లైగర్( Liger ) సినిమా విషయంలో ఇదే జరిగిందని చెప్పవచ్చు.నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోవడంతో నష్టాలను తీర్చమంటూ రోడ్డుకెక్కిన విషయం తెలిసిందే.ఆచార్య సినిమా దర్శకుడు పరిస్థితి కూడా అంతే ఉంది.

అయితే టాలీవుడ్( Tollywood ) లో ఇవన్నీ కొత్త ఏం కాదు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో నటించిన సినిమాలు ఏదో ఒక సమయంలో ఫ్లాప్ గా నిలిచాయి.

చిరంజీవి( Chiranjeevi ) మృగరాజు తర్వాత నిర్మాత కె దేవీవరప్రసాద్( K Devivaraprasad ) ఎక్కువ కాలం పరిశ్రమలో కొనసాగలేకపోయారు.ఘరానా మొగుడు లాంటి ఇండస్ట్రీ హిట్ తీసింది ఆయనే.

Telugu Akhil, Balakrishna, Chiranjeevi, Disaster, Nithin, Tollywood-Movie

బాలకృష్ణ ఒక్క మగాడు ప్రభావంతో వైవిఎస్ చౌదరి ( YVS Chaudhary )మళ్ళీ అగ్ర హీరోలను కలుసుకోలేకపోయాడు.అలాగే అక్కినేని నాగార్జున రక్షకుడు( raksakudu ) పాతికేళ్ల క్రితమే పదిహేను కోట్లకు అమ్ముడుపోతే అందులో పావు వంతు కూడా వెనక్కు తేలేకపోయింది.రెబల్ కు జరిగిన ఓవర్ బడ్జెట్ వల్లే లారెన్స్ కు నిర్మాతలకు విభేదాలు వచ్చాయి.మహేష్ బాబు నాని ( nani )వల్ల అతని స్వంత అక్కయ్య మంజుల నష్టాలు చవి చూడాల్సి వచ్చింది.

తారక్ శక్తి ముప్పై కోట్లు పోగొట్టిందని అశ్వినిదత్తే ఒప్పుకున్నారు.అఖిల్ మొదటి సినిమా కంటెంట్ తో పాటు కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచి నిర్మాత నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డికి పెద్ద షాక్ ఇచ్చింది.

ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క హీరోకి ఏదో ఒక సమయంలో ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతూనే వచ్చాయి.ఆ సినిమాలు ఫ్లాప్ అవడంతో పాటు నిర్మాతల నుంచి ఎగ్జిబిటర్ల వరకు ప్రతి ఒక్కరిని బాధించాయి.

ఎప్పటినుంచి మొదలైన ఈ డిజాస్టర్స్ ఇప్పటికీ అలాగే కొనసాగుతూనే ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube