సాధారణంగా విద్య నేర్పే గురువులు తమ విద్యార్థినీ, విద్యార్థులకు ఎంతో సీరియస్ గా పాఠాలు చెబుతూ ఉంటారు.ఇంకా పిల్లలు ఏదన్నా తప్పు చేస్తే వారిని దండిస్తారు కానీ, ఇంట్లో తల్లిదండ్రులు మాదిరి వ్యవహరించరు.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న ఓ గురువు మాత్రం ఓ పాపను నిద్రపుచ్చాల్సిన పరిస్థితి వచ్చింది.విషయం తెలియాలంటే ఈ పూర్తి కధనాన్ని చదవండి.
వివరాల్లోకి వెళితే, వరంగల్( Warangal ) కి చెందిన సీనియర్ సంగీత గురువు ‘ఉమ్మాడి లక్ష్మణాచారి’( Ummadi Lakshmanachari’ ) తన విధుల నిమిత్తం కరీంనగర్ లో టీచర్ ట్రైనింగ్ కోర్స్ కి సంబంధించిన అభ్యర్థులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది.అయితే అందులో ఓ స్టూడెంట్ కి ఈ మధ్యనే డెలివరీ కావడం జరిగింది.
దాంతో తన 3 నెలల పాపతో సహా క్లాసులకు హాజరవుతోంది.అయితే ఆ చిన్నారి క్లాసులో చేస్తున్న అల్లరి చూసిన సదరు లెక్చరర్ తన జోల పాటతో నిద్ర పుచ్చడానికి చేసిన ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ స్టూడెంట్ కి చెందిన 3 నెలల పాపకు లాలి పాట పాడాల్సి వచ్చింది.కాగా సదరు వీడియో చూసిన నెటిజన్లు తెగ సంబరపడిపోతున్నారు.దాంతో చాలామంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.ఎంతైనా కళాకారులకు సున్నిత మనస్సు కాస్త ఎక్కువే అనడానికి ఈ వీడియోని నిదర్శనమని కొంతమంది కామెంట్లు చేస్తే, మరికొందరేమో మ్యూజిక్ టీచర్( Music teacher ) అంటే ఈ మాత్రం ఉంటది అంటూ కామెంట్లు చేయడం ఇక్కడ గమనించవచ్చు.
మీరు కూడా సదరు వీడియో చూసి మీ స్పందనను తెలియజేయండి.







