టాలీవుడ్ ఇండస్ట్రీలో 100 కోట్ల పారితోషికం అందుకుంటున్న స్టార్స్ వీళ్లే!

గత కొన్నేళ్లలో తెలుగు సినిమాల మార్కెట్ ఊహించని స్థాయిలో పెరిగింది.ఇతర భాషల ప్రేక్షకులు సైతం తెలుగు సినిమాల వైపు చూస్తున్నారు.

అదే సమయంలో తెలుగు సినిమాల కలెక్షన్లు రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తున్నాయి.టాలీవుడ్ ఇండస్ట్రీలో 100 కోట్ల పారితోషికం అందుకుంటున్న స్టార్స్ ఎక్కువమంది ఉన్నారు.

ఈ జాబితాలో చేరుతున్న హీరోల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో 100 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్న హీరోల జాబితాలో ప్రభాస్ ముందువరసలో ఉన్నారు.

ప్రభాస్ అంటే 100 కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వాల్సిందేనని నిర్మాతలు సైతం ఫిక్స్ అవుతున్నారు.మరోవైపు పుష్ప ది రైజ్ సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ కూడా పారితోషికాన్ని పెంచారు.

Advertisement

పుష్ప ది రూల్ కు బన్నీ 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను సొంతం చేసుకుంటున్నారు.

ఈ జాబితాలో చేరిన మరో హీరో రామ్ చరణ్ కావడం గమనార్హం.చరణ్ శంకర్ కాంబో మూవీకి చరణ్ 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ కోసం తారక్ కూడా ఇదే స్థాయిలో పారితోషికంను అందుకుంటున్నారని సమాచారం అందుతోంది.

మరో స్టార్ హీరో మహేష్ బాబు రాజమౌళి సినిమాకు ఇదే రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.

టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఈ స్థాయిలో పారితోషికాలు తీసుకుంటూ ఇతర ఇండస్ట్రీలకు సైతం షాకిస్తున్నారు.హరిహర వీరమల్లు సినిమాతో సక్సెస్ సాధిస్తే పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ కూడా 100 కోట్ల రూపాయలకు చేరే ఛాన్స్ ఉంది.టాలీవుడ్ యంగ్ జనరేషన్ స్టార్ హీరోలంతా భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?

రాబోయే రోజుల్లో కూడా స్టార్ హీరోల పారితోషికాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

Advertisement

తాజా వార్తలు