టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha )ప్రస్తుతం బ్రేక్ లో ఉన్న విషయం తెలిసిందే.సంవత్సరం పాటు తాను ఎలాంటి సినిమాలు చేయనని.
షూటింగ్స్ కి హాజరు కాను అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించి బ్రేక్ తీసుకుంది.అన్నట్లుగానే విదేశాలకు చెక్కర్లు కొడుతూ పూర్తి విశ్రాంతి మూడ్ లో సమంత ఉన్న విషయం ను ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
సోషల్ మీడియా( Social media ) ద్వారా ఆమె ఎప్పటికప్పుడు తన ఫోటోలను మరియు సన్నిహితుల ఫోటోలను తాను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.

ఇక ఆమె బ్రేక్ టైం ముగియబోతున్నట్లుగా తెలుస్తుంది.వచ్చే ఏడాది సమ్మర్ నుండి ఆమె కొత్త సినిమా షూటింగ్లో పాల్గొనబోతుంది అంటూ సమాచారం అందుతుంది.ప్రముఖ దర్శకుడు ఇప్పటికే ఆమెతో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాకి ఓకే చెప్పించాడని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఒకటి ఆ సినిమా నిర్మాణానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది.
వారు సమంతకి ఏకంగా నాలుగు కోట్ల రూపాయల పారితోషికం ఆఫర్ చేశారు అంటూ కూడా సమాచారం అందుతుంది.మొత్తానికి సమంత బ్రేక్ తీసుకున్న తర్వాత కొత్త సినిమా వెంటనే చేయబోతుందని క్లారిటీ వచ్చేసింది.

అయితే ఆ దర్శకుడు ఎవరు ఆ నిర్మాణ సంస్థ ఏంటి అనేది తెలియాలంటే మరి కొన్ని వారాల వరకు వెయిట్ చేయాల్సిందే.ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని సమంత ఎప్పుడు డేట్లు ఇస్తే అప్పుడు షూటింగ్ మొదలు పెట్టేందుకు రెడీగా ఉన్నట్లుగా దర్శకుడు సన్నిహితుల వద్ద పేర్కొన్నాడట.అంటే అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాదిలోనే సమంత కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఏడాది గ్యాప్ తీసుకున్నా కూడా ఎలాంటి బ్రేక్ లేకుండా వచ్చే సంవత్సరం సమంత సినిమా రాబోతుంది అంటే చాలా గొప్ప విషయం అన్నట్లుగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంవత్సరం లో ఖుషి సినిమా( Kushi ) తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత వచ్చే ఏడాదిలో ఆ లేడీ ఓరియంటెడ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో చూడాలి.