కరోనా కి భయపడి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి వచ్చేసిన స్టార్ హీరోయిన్...

తెలుగులో పెద్ద హీరో సందీప్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన  పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు సినీ  ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే ఈ అమ్మడు ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో షూటింగ్ నిమిత్తం వెళ్లి అక్కడే ముంబైలో ఇరుక్కుపోయింది.

కాగా ప్రస్తుతం ముంబైలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుండడంతో ఇటీవలే ముంబై నగరం నుంచి హైదరాబాద్ కి వచ్చినట్లు సమాచారం.అయితే  రకుల్ సింగ్ తో పాటు హైదరాబాద్ కి ఆమె తమ్ముడు కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

కాగా ఈ విషయానికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.  ప్రస్తుతం ముంబై నగరంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి.

అందువల్లే రకుల్ ప్రీత్ సింగ్ తన తమ్ముడితో కలిసి హైదరాబాద్ కి వచ్చినట్లు తెలుస్తోంది.కాగా ప్రస్తుతం రకుల్ బంజారా హిల్స్ పరిసర ప్రాంతంలో ఉన్న తన నివాసంలో ఉంటున్నట్లు సమాచారం.

Advertisement

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ విలక్షణ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న  "భారతీయుడు 2" అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.అలాగే బాలీవుడ్ లో కూడా ప్రముఖ దర్శకుడు లక్ష రాజ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న "అటాక్" అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు