మొన్న సంక్రాంతి కి టాలీవుడ్ స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ వాల్తేరు వీరయ్య మరియు వీర సింహా రెడ్డి సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఆ రెండు సినిమా లు కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.
సాధారణం గా సంక్రాంతి కి పెద్ద సినిమాలు రావడం తో పాటు రెండు నెలల గ్యాప్ తర్వాత సమ్మర్ లో అంటే మార్చి చివరి నుండి ఏప్రిల్ లో భారీ ఎత్తున పెద్ద హీరోల సినిమాలు విడుదలవ్వడం ప్రతి ఏడాది చూస్తూనే ఉన్నాం, కానీ ఈ సారి పరిస్థితి విభిన్నంగా ఉండబోతుంది అనే ప్రచారం జరుగుతుంది.ఈ సమ్మర్ లో పెద్ద హీరో ల సినిమా ల సందడి కనిపించక పోవచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి ఏప్రిల్ నెలలో భోళా శంకర్ సినిమా తో వస్తాడని అంతా ఎదురు చూశారు, కానీ షూటింగ్ ఆలస్యం అవుతున్న కారణంగా సమ్మర్ స్కిప్ చేసినట్లుగానే కనిపిస్తోంది.

ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా ని కూడా ఏప్రిల్ నెలలో విడుదల చేయాలని మొదట భావించారు.కానీ షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల ఏప్రిల్ నెలలో విడుదల చేయడం లేదని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.అంతే కాకుండా పలువురు హీరోలు కూడా సమ్మర్ ని స్కిప్ చేసినట్లుగా తెలుస్తోంది.
అయితే ఈ సమ్మర్ లో రాబోతున్న పెద్ద హీరోలంటే రవితేజ మరియు నాని మాత్రమే.ఈ ఇద్దరు కాకుండా చిన్న హీరో లు వరుసగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
సమ్మర్ సీజన్ లో టాలీవుడ్ నుండి 10 నుండి 15 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి అయితే అందులో క్రేజ్ ఉన్న స్టార్ హీరోల సినిమాలు లేకపోవడం విశేషం.