మెగా హీరో సాయితేజ్ జోరు తగ్గడం వెనుక అసలు కథ ఇదేనా?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మెగా మేనల్లుడుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.

 Latest News About Mega Hero Sai Dharam Tej ,sai Dharam Tej, Tollywood, Sai Dhara-TeluguStop.com

అయితే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో వరుసగా సినిమాలు చేస్తూ మామకు తగ్గ మేనల్లుడు అనిపించుకున్నాడు.సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయాడు.

అలా తన సినిమాలతో మినిమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి ధరమ్ తేజ్.

అంతేకాకుండా తక్కువ సమయంలోనే భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు.

ఇక చివరిగా సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్, రిపబ్లిక్ సినిమాలతో ప్రేక్షకులను పులకరించాడు.ఈ రెండు సినిమాలు విడుదల అయ్యి ఊహించిన విధంగా డిజాస్టర్ లుగా నిలిచాయి.

కాగా రిపబ్లిక్ సినిమా సమయంలోనే తేజ్ కీ భారీ యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే.దాదాపు నెల రోజులపాటు హాస్పిటల్ బెడ్ పై చికిత్స అందుకుంటూ పోరాడి గెలిచాడు.

Telugu Sai Dharam Tej, Tollywood, Vaishnav Tej, Varun Tej, Virupaksha-Movie

ఇది ఇలా ఉంటే సాయి ధరమ్ తేజ్ తాజాగా నటిస్తున్న సినిమా విరూపాక్ష.అయితే సాయి ధరమ్ తేజ్ తో పాటు మిగిలిన హీరోలు సోదరుడు వైష్ణవ్ తేజ్ అలాగే వరుణ్ తేజ్ లు కూడా రెండు మూడు సినిమాలు తో బిజీగా ఉండగా సాయి ధరమ్ తేజ్ మాత్రం ఈ విరూపాక్ష అనే ఒక్క సినిమాలో మాత్రమే నటిస్తున్నాడు.

Telugu Sai Dharam Tej, Tollywood, Vaishnav Tej, Varun Tej, Virupaksha-Movie

ఈ సినిమా విడుదల తర్వాత ఆ సినిమా రిజెల్ట్ ని బట్టి తన తదుపరి సినిమా ఏ విధంగా ఉండాలి అన్న విషయంలో ఒక నిర్ణయానికి రావాలని సాయి ధరమ్ తేజ్ ఉద్దేశంగా చెబుతున్నారు.ఏది ఏమైనా అప్పటికి సాయి ధరంతేజ్ తన కెరియర్ పరంగా కాస్త వెనక పడ్డాడు అని చెప్పవచ్చు.అయితే సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న విరూపాక్ష సినిమా సమ్మర్ లో అనగా ఏప్రిల్ లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.సాయి ధరంతేజ్ తదుపరి సినిమా మాత్రం ఎవరితో అన్నది ఇంకా తెలియడం లేదు.

సాయి జోరు తగ్గడానికి అతని యాక్సిడెంట్ ఒక పెద్ద కారణమని చెప్పవచ్చు.దానికి తోడు నటించిన సినిమాలు అన్నీ కూడా ఫ్లాప్ అవుతుండడం మరో కారణంగా గుర్తు చెప్పవచ్చు.

మరి ఇప్పటికైనా సాయి ధరమ్ తేజ్ సినిమాల కథల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారో లేదో చూడాలి మరి.అలాగే ప్రస్తుతం నటిస్తున్న విరూపాక్ష అతనికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube