నా తమ్ముడు నా గుండెకాయ.. ఎన్టీఆర్ పై కళ్యాణ్ రామ్ ప్రేమకు ఫిదా కావాల్సిందే!

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మధ్య మంచి అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే.తారక్, కళ్యాణ్ రామ్ ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరి కెరీర్ కు మరొకరు ప్లస్ అవుతున్నారు.

 Kalyan Ram Affection On Young Tiger Ntr Amigos Pre Release Event Details, Kalyan-TeluguStop.com

అమిగోస్ ఈవెంట్ లో భాగంగా ఎన్టీఆర్ పై కళ్యాణ్ రామ్ చూపించిన ప్రేమాభిమానాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.నా తమ్ముడు నా గుండెకాయ అంటూ కళ్యాణ్ రామ్ కామెంట్లు చేయడం గమనార్హం.

కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ అమిగోస్ థ్రిల్లర్ మూవీ అని అన్నారు.

మనుషులను పోలిన మనుషుల కథతో తొలిసారి వినూత్నమైన థ్రిల్లర్ ను తెరకెక్కించామని ఆయన తెలిపారు.

ఈ తరహా కథతో సినిమాను తెరకెక్కించినందుకు రాజేంద్రకు కృతజ్ఞతలు అని కళ్యాణ్ రామ్ కామెంట్లు చేశారు.బింబిసార తర్వాత ఎలాంటి కథలో నటించాలని అనుకున్న సమయంలో ఈ కథ నా దగ్గరకు వచ్చిందని ఆయన వెల్లడించడం గమనార్హం.

Telugu Amigos, Amigos Pre, Kalyan Ram, Nandamurikalyan, Ntr Kalyan Ram-Movie

జిబ్రాన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడని సౌందర్ రాజన్ లేకపోతే సినిమా ఇంత బాగా వచ్చేది కాదని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు.అషికా ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమవుతుందని ఆయన అన్నారు.నా లైఫ్ లో నాకు సపోర్ట్ చేస్తూ నా పక్కనే ఉన్న తమ్ముడికి కృతజ్ఞతలు అని ఆయన చెప్పుకొచ్చారు.ఈ మూవీలో బ్రహ్మాజీ ఇంకో హీరో అని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.

Telugu Amigos, Amigos Pre, Kalyan Ram, Nandamurikalyan, Ntr Kalyan Ram-Movie

మరో నాలుగు రోజుల్లో విడుదలవుతున్న అమిగోస్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో ఎక్కువగా నటిస్తున్న కళ్యాణ్ రామ్ కు ఆ పాత్రలే కలిసొస్తున్నాయి.విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.కళ్యాణ్ రామ్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండగా తొమ్మిది కోట్ల రూపాయల టార్గెట్ తో ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube