సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలు ఎంతోమంది ఒక వివాహం మాత్రమే కాకుండా రెండు పెళ్లిళ్లు చేసుకున్నటువంటి వారు ఉన్నారు.కొన్ని కారణాలవల్ల వారు రెండో వివాహాలు కూడా చేసుకున్నారు.
అయితే ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నటువంటి కొందరు హీరోలకు తండ్రి ఒకరైన తల్లులు మాత్రం వేరే ఉన్నారు.మరి తండ్రి ఒకరై తల్లులు వేరుగా ఉన్నటువంటి ఆ సెలబ్రిటీలు ఎవరో చూసేద్దాం
ఎన్టీఆర్ -కళ్యాణ్ రామ్:
నందమూరి హీరోలుగా గుర్తింపు పొందినటువంటి ఎన్టీఆర్( NTR ) కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇక వీరిద్దరూ సీనియర్ సినీ నటుడు నందమూరి హరికృష్ణ కుమారులు అయితే ఎన్టీఆర్ హరికృష్ణ రెండో భార్య శాలిని కొడుకు కాగా కళ్యాణ్ రామ్ హరికృష్ణ పెద్ద భార్య కుమారుడు అయినప్పటికీ వీరి మధ్య అనుబంధం ఎంతో ఉందని చెప్పాలి.

మహేష్ -నరేష్:
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ గా కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు (Mahesh Babu) సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు కృష్ణ పెద్ద భార్య దేవి కుమారుడు అలాగే ఈయన రెండవ వివాహంగా విజయ నిర్మలను పెళ్లి చేసుకున్నారు.విజయనిర్మల కుమారుడే నరేష్ (Naresh)అయితే ఈయన కృష్ణకు జన్మించిన సంతానం కాదు కానీ విజయనిర్మలను కృష్ణ రెండో పెళ్లి చేసుకోవటం విశేషం.

నాగచైతన్య -అఖిల్:
అక్కినేని నాగార్జున కుమారులుగా నాగచైతన్య( Nagachaitanya ) అఖిల్ (Akhil) ఇద్దరు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు వీరిద్దరూ ఎంతో సొంత అన్నదమ్ములు గానే ఉంటారు కానీ వీరిద్దరికి తండ్రి ఒకటే అయిన తల్లులు మాత్రం వేరు చైతన్య దగ్గుబాటి లక్ష్మి కుమారుడు కాగా అఖిల్ నటి అమల కుమారుడు.వీరికి తల్లులు వేరైనా తండ్రి మాత్రం ఒక్కరే.

మంచు విష్ణు -మనోజ్:
మోహన్ బాబు వారసులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు మనోజ్ ( Manoj ) విష్ణు (Vishnu) మంచు లక్ష్మి(Manchu Lakshmi).ఇక ఈ ముగ్గురికి తండ్రి మోహన్ బాబు అయినప్పటికీ తల్లులు మాత్రం వేరు మంచు లక్ష్మి విష్ణు మోహన్ బాబు పెద్ద భార్య అయినటువంటి విద్యా దేవికి జన్మించారు.ఈమె మరణించడంతో తన సోదరి అయినటువంటి నిర్మలాదేవి కుమారుడు ఇక ఈ ముగ్గురికి కూడా తండ్రి ఒకరి అయినా తల్లులు మాత్రం వేరు.