ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే అన్ని హిట్లు.. టాలీవుడ్ లో ఇప్పుడు ఇదే సెంటిమెంట్?

ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న యువ హీరోలు పెళ్లి వెంటపడుతున్నారు.పెళ్లి వెంటపడటం ఎందుకండి ఎంచక్కా పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటారా.

మీరు అనుకుంటున్నట్లు నిజ జీవితంలో పెళ్లి వెంట పడటం లేదు సినిమా కథలో పెళ్లి వెంటపడుతున్నారు.ఎందుకంటే ఇటీవల కాలంలో పెళ్లి అనే కాన్సెప్ట్ తో వస్తున్న ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ విజయం సాధిస్తున్నాయి.

దీంతో ఇక యువహీరోలు అందరి చూపు పెళ్లి అనే కాన్సెప్ట్ పై పడిపోయింది.ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి అవడం లేదు నాకు పెళ్లి చేయండి అంటూ సినిమాలోని పేరెంట్స్ వెంటపడుతున్న యువ హీరోల సినిమాల్లో పెళ్లి చేసుకోవడమే కాదు సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటున్నారు.

ఇక పెళ్లి అనే కాన్సెప్ట్తో కూడిన సినిమాలను ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కిస్తున్నారు.ఇక ఇటీవలే యువ హీరో శర్వానంద్ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా కూడా ఇలాంటి కాన్సెప్ట్ తోనే తెరకెక్కింది.

Advertisement

ఇక శర్వానంద్కు చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ లభించింది.పెళ్లి చేసుకోవడానికి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న అబ్బాయి చివరికి రష్మిక ను పెళ్లి చేసుకోవడానికి తంటాలు పడతాడు.

ఇక ఇదే క్యారెక్టర్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.అయితే పెళ్లి కాన్సెప్టుతో అటు యువ హీరో నాగ శౌర్య కూడా బాగా హిట్టయ్యాడు ఇప్పటికే యాక్షన్ లవ్ ఎమోషనల్ ఇలా అన్ని ట్రై చేసిన నాగ శౌర్య.

ఇప్పుడు పెళ్లి అనే కాన్సెప్టుతో వరుడు కావలెను అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.రీతు వర్మ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా ఇక నాగ శౌర్య కెరీర్ లో డీసెంట్ హిట్ గా నిలిచింది.

కెరీర్ మొదటి నుంచి హిట్టు లేక నానా తంటాలు పడిన అఖిల్ చివరికి పెళ్లితో ఒక్కటయ్యాడు.అంతేకాదు ఇక హిట్టు కూడా ఖాతాలో వేసుకున్నాడు.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

అఖిల్ పూజా హెగ్డే జంటగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.పెళ్లి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

Advertisement

అఖిల్ కెరీర్ లో మొదటి హిట్ గా నిలిచింది ఈ సినిమా.

గత ఏడాది కరోనా సమయంలో కూడా ప్రేక్షకులందరినీ కడుపుబ్బ నవ్వించిచిన సినిమా రంగ్ దే.నితిన్ కీర్తి సురేష్ జంటగా పెళ్లి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది.ఈ సినిమా నితిన్ కు మంచి హిట్ ఇచ్చింది.

ఇక ఎన్నో రోజుల నుంచి హిట్ లేక సతమతమవుతున్న నితిన్ కు ఈ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ఇక ఇదంతా చూసిన తర్వాత మిగతా యువ హీరోలు ఊరుకుంటారా వాళ్లు కూడా పెళ్లి కాన్సెప్ట్తో సినిమా తీయడం కోసం ఎదురుచూస్తున్నారు.

ఇక ఇప్పుడు యువ హీరో విశ్వక్సేన్ సైతం పిల్లను ఎవరూ ఇవ్వడం లేదు అంటూ పెళ్లి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు.

" autoplay>

తాజా వార్తలు