టాలీవుడ్ లో చాలామంది హీరోయిన్స్ సినిమాలు చేసి సంపాదించుకున్నామా, డబ్బులు కూడా పెట్టామా అన్నట్టుగానే ఉంటారు చాలా తక్కువ మంది సంపాదించిన దాన్ని సొసైటీకి తిరిగి ఇవ్వాలని ఉద్దేశంతో ఉంటారు.అందులో హీరోలకు వచ్చినంత పారితోషకం హీరోయిన్స్ కి రాదు కాబట్టి వారికి పెద్దగా డబ్బులు సర్వీస్ చేసే అవకాశం దక్కదు.
ప్రస్తుతం ఈ ఒరవడికి చరమాంకం పలికి మేము కూడా సర్వీస్ చేస్తాము అని నిరూపిస్తున్నారు కొంత మంది టాలీవుడ్ హీరోయిన్స్. ఆ హీరోయిన్స్ ఎవరు ? ఎలాంటి సర్వీసెస్ చేస్తున్నారు ? అనే విషయాలను ఈ ఆర్థికల్ లో తెలుసుకుందాం.
సమంత( Samantha ) ఈ లిస్టులో ముందు వరుసలో ఉంటుంది.ఆమె ప్రత్యూష అనే ఫౌండేషన్ ద్వారా చాలా మంది పిల్లలకు సహాయం చేస్తుంది.సంపాదించుకున్న దాంట్లో 90% సేవా కార్యక్రమాలకు వినియోగించడం సమంతకి మాత్రమే చెల్లింది.ఇక శృతిహాసన్( Shruti Haasan ) సైతం ఈ లిస్టులో ఉన్నారు.తన తండ్రి కమల్ హాసన్ స్థాపించిన ఒక ఆర్గనైజేషన్ ద్వారా చాలామందికి ఆరోగ్యం, చదువు విషయంలో సహాయం చేస్తున్నారు శృతి హాసన్.పేద పిల్లలకు సహాయం చేయడానికి తాను ఎప్పుడూ ముందుంటానని ప్రకటించేసారు కూడా.
హన్సిక ( Hansika ) సైతం చాలా చిన్న వయసు నుంచి సేవా కార్యక్రమాలు చేస్తుంది.
25 మంది పిల్లలను దత్తత తీసుకొని వారి చదువుకు కావాల్సిన సహాయాన్ని హన్సిక తానే స్వయంగా అందిస్తుంది.అంతేకాదు సమయం చికినప్పుడల్లా వారికీ ఇంగ్లీష్ మరియు లీడర్ షిప్ క్వాలిటీస్ కూడా నేర్పిస్తూ ఉంటుంది హన్సిక.ఇక శ్రీ లీల( Sreeleela ) సైతం అంగవైకల్యం ఉన్న పిల్లలను దత్తత తీసుకొని వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తుంది.
ఆమె సొంతంగా ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది.ఈ క్లబ్ లో ఇప్పుడు సంయుక్త మీనన్( Samyuktha Menon ) సైతం చేరారు.
ఆమె శ్రీ శక్తి సేవ అనే ఒక సంస్థ ప్రారంభించి మహిళలకు, పిల్లలకు కావలసిన అన్ని సహాయ సహకారాలు అందించడానికి సిద్ధమయ్యారు.ఇలా ఈ హీరోయిన్స్ అంతా సేవ కోసం తమ డబ్బును ఖర్చు పెట్టడం నిజంగా చాలా గొప్ప విషయం.