ఫస్ట్ లుక్ తోనే స్టార్ హీరోయిన్స్ అయిన టాలీవుడ్ భామలు వీరే!

సినిమాల్లో అవకాశాలు రావడం అనేది మాములు విషయం కాదు.ఎంతో కష్టపడితే కానీ అవకాశాలు రావు.

అలాంటిది మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ అవ్వడం అనేది అసంభవం.కానీ కొందరు హీరోయిన్లు మొదటి చిత్రంతోనే స్టార్ హీరోయిన్ల ఫెమ్ వచ్చేస్తుంది.

అలా ఫెమ్ సంపాదించినా హీరోయిన్లు కొందరు ఉన్నారు.వారి రెండో సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసినవారు ఉన్నారు.

మరి ఆ హీరోయిన్లు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

సౌత్ సినీ ఇండస్ట్రీలో పరిచయమైన నటి సమంత.ఈమె మొదట చిత్రంతోనే మంచి క్రేజ్ దక్కించుకుంది.గౌతమ్ వాసుదేవ్ దర్శకత్వంలో వచ్చిన ఏం మాయ చేసావే చిత్రంతో ప్రేక్షకులని జెస్సీ పాత్రలో నటించి నిజంగానే మాయ చేసింది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ లో నెంబర్ 1 సమంత.

ఊహలు గుస గుసలాడే సినిమాతో ప్రభావతి పాత్రతో ఆకట్టుకున్న రాశి ఖన్నా ఆ సినిమాలో మొదటి చూపుకే ప్రేక్షకుల మనసు సొంతం చేసుకుంది.ఇప్పుడు హాట్ హాట్ లుక్కులతో అందరిని మైమరిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ!

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో ప్రార్థనా ఇక్కడ అంటూ అందరినీ తొలి చూపులతోనే పడేసిన.రకుల్ ప్రీత్ సింగ్.ఈమె అందరినీ ఆ సినిమాతో బాగా ఆకట్టుకుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఆర్ఎక్స్ 100 సినిమా ఎంత పెద్ద హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇందుగా పరిచయం అయ్యి అందరిని అద్భుతమైన నటనతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయినా భామ పాయల్ రాజ్ పుత్!

Advertisement

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో ప్రీతి పాత్రలో మెరిసి అందరినీ ఆకట్టుకుంది శాలిని పాండే.మంచి స్టార్ హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీ సంపాదించినప్పటికీ తెలుగు సినిమాల్లో ఎక్కువ కనిపించలేదు ఈ ముద్దుగుమ్మ!

శేకర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో భానుమతిగా అందరిని ఆకట్టుకున్న సాయి పల్లవి.తెలంగాణ పిల్లగా తన మాటలతో ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది సాయిపల్లవి.ఆతర్వాత అందరు స్టార్ హీరోల సరసన నటిస్తూ స్టార్ డమ్ అనుభవిస్తుంది హైబ్రిడ్ పిల్ల!.

తాజా వార్తలు