అందుకే తన భర్త తో విడిపోయానంటున్న తెలుగు హీరోయిన్...

తెలుగులో ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన "7/జి బృందావన కాలనీ" అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టువంటి హీరోయిన్ "సోనియా అగర్వాల్" గురించి తెలుగు ప్రేక్షకులకి చేయాల్సిన అవసరం లేదు.

అయితే అంతకు ముందు "నీ ప్రేమకై, ధమ్"  అనే చిత్రాల్లో నటించినప్పటికీ ఆ చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.

అయితే సోనియా అగర్వాల్ 7/జి బృందావన కాలనీ చిత్రం లో నటించే సమయంలో ఆ చిత్ర దర్శకుడు సెల్వ రాఘవన్ తో ప్రేమలో పడింది. దీంతో వీరిద్దరూ 2006వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు.

కానీ పెళ్లయిన నాలుగు సంవత్సరాలకి ఇద్దరి మధ్య విభేదాలు, మనస్పర్ధలు రావడంతో 2010వ సంవత్సరంలో విడిపోయారు. అప్పటినుంచి ఇప్పటివరకు సోనియా అగర్వాల్ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు.

అయితే వీరిద్దరు విడిపోయిన అనంతరం సోనియా అగర్వాల్ మళ్లీ సినిమాల్లో నటించడం ప్రారంభించినప్పటికీ ఆమె సినీ కెరీర్ అంత ఆశాజనకంగా సాగడం లేదు.అయితే తెలుగులో విన్నర్, టెంపర్ తదితర చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది.

Advertisement

కాగా ఇటీవలే మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సోనియా అగర్వాల్ సన్నద్ధమవుతున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి.ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సోనియా అగర్వాల్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న "రెడ్" అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

చిత్రంలో హీరోగా టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు