1980-90 ల్లో స్టార్ హీరోల సినిమాలు మొదట వంద నుండి రెండు వందల థియేటర్ లలో విడుదల అయ్యి సక్సెస్ అయితే రీ రిలీజ్ అవుతూ ఉండేవి.ఏడాది అంతా కూడా ఎక్కడో ఒక చోట సినిమా రీ రిలీజ్ అవుతూనే ఉండేది.
మారుమూల ప్రాంతాల్లో సినిమాలను మెల్లగా ఆలస్యంగా విడుదల చేసేవారు.కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా సాధ్యం అయినంత ఎక్కువ థియేటర్లలో సినిమాను రిలీజ్ చేసేందుకు చూస్తున్నారు.సినిమా రీ రిలీజ్ అనేది ఈమధ్య కాలంలో కొత్త సినిమాలకు వినడం లేదు.
కానీ పాత సినిమా లు మళ్లీ వస్తున్నాయి.పెద్ద హీరోల సినిమాలు మరియు స్టార్ హీరోయిన్స్ సినిమాలు దర్శకుల సినిమాలను భారీ ఎత్తున రీ రిలీజ్( Re-release Movies ) చేసేందుకు గాను అభిమానులు ముందుకు వస్తున్నారు.

పవన్ కళ్యాణ్.మహేష్ బాబు.ప్రభాస్.ఇలా ఎంతో మంది స్టార్ హీరోల అభిమానులు తమ అభిమాన హీరో యొక్క సినిమాలను బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.ముందు ముందు మరిన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.అయితే అభిమానులు సంతోషం కొద్ది సినిమాలను రీ రిలీజ్ చేస్తే పర్వాలేదు కానీ ఈగోలకు వెళ్లి అతిగా ప్రవర్తిస్తున్నారు.
భారీ వసూళ్లు వచ్చాయి అంటూ కొందరు చెప్పుకోవడంతో పాటు మరి కొందరు థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు.ఇటీవల ఎన్టీఆర్ యొక్క సింహాద్రి సినిమా( Simhadri ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆ సినిమా భారీ విజయాన్ని రీ రిలీజ్ లోనూ సొంతం చేసుకుంది.ఫ్యాన్స్ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించి విమర్శల పాలు అయ్యారు.థియేటర్ లో నానా రచ్చ చేయడంతో పాటు కొన్ని చోట్ల థియేటర్ బయట కూడా రచ్చ చేశారు.కర్ణాటకలోని ఒక థియేటర్ వద్ద రెండు మేక లను నరికి వాటి రక్తంతో ఫ్లెక్సీలపై రక్తాభిషేక్ చేయడం జరిగింది.
ఇది ఎంత వరకు కరెక్ట్ అంటే వారి నుండి సమాధానం లేదు.ఆ మధ్య ఒక స్టార్ హీరో ఫ్యాన్స్ థియేటర్ లో క్రాకర్స్ కాల్సి థియేటర్ కాలిపోయేలా చేశారు.
మొత్తానికి అభిమానులు రీ రిలీజ్ పేరుతో చేస్తున్న రచ్చ కారణంగా థియేటర్ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.







