తెలంగాణలో హస్తం పార్టీ నేతలు ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు.కర్నాటక ఎన్నికల్లో లభించిన విజయంతో తెలంగాణలో సైతం దూకుడుగా వ్యవహారిస్తున్నారు.
తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో కర్నాటక మాదిరి విజయం సాధించి కోల్పోయిన పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలని భావిస్తున్నారు.అందుకోసం ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు టి కాంగ్రెస్ నేతలు( T Congress leaders ).సరిగ్గా ఎన్నికలకు ఐదు నెలకు మాత్రమే సమయం ఉండడంతో ఈ ఐదు నెలల్లో పక్కా ప్రణాళికబద్దంగా వ్యూహరచనతో ముందుకు సాగాలని హస్తం హైకమాండ్ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కర్నాటకలో ఏ వ్యూహంతో విజయం సాధించారో అదే వ్యూహాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తూ.ఇంకా తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లో సెంటిమెంట్ రాజేసేలా కాంగ్రెస్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక వచ్చే నెల నుంచి ప్రియాంకా గాంధీ వరుసగా తెలంగాణలో పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నెలకు కనీసం రెండు సార్లు రాష్ట్రంలో పర్యటిస్తూ ఎన్నికల వరకు అందరి దృష్టి కాంగ్రెస్ పైనే ఉండేలా టి కాంగ్రెస్ నేతలు ప్రణాళికలు వేసినట్లు తెలుస్తోంది.ఆ మద్య నిరుద్యోగ సభలో ప్రియాంక గాంధీ చేసిన ప్రసంగానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఆమె వాక్చాతుర్యం ప్రజలను కట్టిపడేసిందనే చెప్పాలి.అందువల్ల రాష్ట్రంలో వీలైనంతా ఎక్కువ సమయం ప్రియాంక గాంధీ కేటాయించేలా ప్రతిపాదనను టి కాంగ్రెస్ హైకమాండ్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది.ఇక ఈ నెల 26న టి కాంగ్రెస్ నేతలతో కాంగ్రెస్ హైకమాండ్ బేటీ కానుంది.ఈ భేటీలో రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
అయితే టి కాంగ్రెస్ లో గత కొన్నాళ్లుగా వర్గపోరు నడుస్తున్న సంగతి తెలిసిందే.అందువలాల్ నేతల మద్య అంతరాన్ని తగ్గించి ఈసారి ఎలాగైనా తెలంగాణలో సత్తా చాటలని చూస్తున్న కాంగ్రెస్.
విజయం కోసం సర్వ శక్తులు ఒడ్డుతోంది.మరి కాంగ్రెస్ కు తెలంగాణ ఎన్నికలు ఎలాంటి రిజల్స్త్ ను ఇస్తాయో చూడాలి.







