పని చేయాలనీ ఉంటె చాలు అవకాశాలు ఎక్కడైనా ఉంటాయి.చేసే ఇంట్రెస్ట్ ఉంటే చాలు ఇండస్ట్రీ ఏదైనా కూడా ఎదో ఒక సినిమా ఉండే ఉంటుంది.
ఇప్పుడు టాలీవుడ్ లో ( Tollywood ) ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్స్, అవకాశాలు తగ్గిపోయిన వారికి కేరళ సినిమా ఇండస్ట్రీ ఎర్ర తివాచి పరుస్తుంది.మరి అలా తెలుగు నుంచి మలయాళం వైపు అవకాశాలు సంపాదిస్తున్న ఆ హీరోయిన్స్ ఎవరు, వారు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
టాలీవుడ్ జేజెమ్మ అయినా అనుష్క( Anushka Shetty ) అవకాశాల రేసులో కాస్త వెనకబడిన సంగతి మనందరికీ తెలిసిందే.సైజ్ జీరో సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు ఇచ్చే నాధుడే లేడు.అయితే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా విజయం సాధించడం తో మళ్లి అనుష్క కొత్త అడుగులు వేస్తుంది.
కథనార్ — ది వైల్డ్ సోర్సెరర్( Kathanar The Wild Sorcerer ) అనే మలయాళ థ్రిల్లర్ ఫాంటసీ చిత్రం తో అనుష్క తొలిసారి అక్కడ డెబ్యూ చేస్తుంది.ఈ సినిమా రెండు పార్ట్ లు గా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దాదాపు 20 ఏళ్ళ క్రితం సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన తమన్నా( Tamanna ) ఇంకా తన హావ కొనసాగిస్తూనే ఉంది.ఇప్పుడు తెలుగు లో ఆమె కెరీర్ దాదాపు ముగిసిపోయిన ఇంకా ఓటిటి ప్రాజెక్ట్స్ తో బిజీ గానే ఉంది.ఇప్పటి వరకు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ వంటి భాషల్లో బాగా పేరు సంపాదించుకున్న తమన్నా మలయాళ సినిమా ఇండస్ట్రీ లో కూడా డెబ్యూ చేయబోతుంది.
మలయాళ హీరో దిలీప్ బాంద్రా చిత్రం లో( Bandra Movie ) హీరోయిన్ గా సెలెక్ట్ అయింది.
తెలుగు లో హ్యాట్రిక్ హిట్ కొట్టిన కృతి శెట్టి( Krithi Shetty ) వరస పరాజయాలను చవి చూడటం తో సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడం కష్టం గా మారింది.దాంతో మొదట తమిళ్ లో అవకాశాలు దక్కించుకున్న కృతి ఇప్పుడు అజాయంతే రాండమ్ మోషణం( Ajayante Random Moshanam ) సినిమాతో మలయాళం లో తన డెబ్యూ చిత్రంలో నటించబోతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy