Tollywood Celebrities 2023: తారకరత్నతో పాటు 2023 లో దివికెగిసిన సినీ తారలు.. ఎవరెవరంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాది అంటే 2023లో ఎంతో మంది ప్రముఖులు, సినీ తారలు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.అయితే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో 2023లో చనిపోయిన సెలబ్రిటీలు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

 Tollywood Celebrities Died In 2023 Tarakaratna K Vishwanath Chandra Mohan Sarat-TeluguStop.com

తారకరత్న:

నందమూరి తారకరత్న(Nandamuri Tarakaratna) లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుతో హాస్పిటల్లో చేరి దాదాపు 23 రోజులపాటు చావు బతుకుల మధ్య ఉండి చివరికి ఫిబ్రవరి 18న కన్నుమూసారు.

జమున:

సావిత్రి కాలం నాటి హీరోయిన్ అయినా సీనియర్ నటి జమున (Jamuna) కూడా ఈ ఏడాది జనవరి 27న మరణించింది.ఈమె వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే అనారోగ్య కారణాలతో మరణించింది.

కె .విశ్వనాథ్ :

కళాతపస్వి కే విశ్వనాధ్ (K Vishwanath) గారు అనారోగ్య కారణాలతో ఫిబ్రవరి 2న మరణించారు.

మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ :

రాజ్ కోటి ద్వయం లో ఒకరిగా పేరు తెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ (Music Director Raj) అనారోగ్య కారణాలతో మే 21న మరణించారు.

రాకేష్ మాస్టర్:

డాన్స్ మాస్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన రాకేష్ మాస్టర్ (Rakesh Master) మద్యానికి బానిసవ్వడం వల్ల మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి జూన్ 18న తుది శ్వాస విడిచారు.

చంద్రమోహన్ :

హృదయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న చంద్ర మోహన్ (Chandra Mohan) నవంబర్ 11న కన్నుమూశారు.

శరత్ బాబు:

విలక్షణ నటుడిగా ఎన్నో మంచి మంచి పాత్రల్లో నటించి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించిన నటుడు శరత్ బాబు (Sharath Babu) మే 22న అనారోగ్య కారణాలతో మరణించారు.వీళ్లే కాకుండా ఇంకా చాలామంది సినీ ప్రముఖులు ఈ ఏడాది దివికెగిసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube