Actress Srilakshmi: నా భర్త గురించి ఎవరికీ తెలియదు.. చెప్పను కూడా.. నటి శ్రీలక్ష్మీ కామెంట్స్ వైరల్?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి శ్రీ లక్ష్మీ( Actress Srilakshmi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కమెడియన్ గా( Comedian ) ఈమె మనందరికీ సుపరిచితమే.

 Tollywood Actress Sri Lakshmi Opens Up About Her Personal Life Problems-TeluguStop.com

తెలుగులోనే కాకుండా తమిళ కన్నడ భాషలో దాదాపుగా 500 కు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది.కేవలం నటిగానే కాకుండా కమెడియన్ గా కూడా రాణించింది.

కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో నటించి మెప్పించింది శ్రీలక్ష్మి.ఇది ఇలా ఉంది తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలక్ష్మి తన ఫ్యామిలీకి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంది.

ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.మా నాన్నకు మేము ఎనిమిది మంది పిల్లలం.నాన్న అమర్నాథ్( Amarnath ) ఇండస్ట్రీలో ఒకప్పటి పెద్ద హీరో.కానీ జాండీస్ రావడంతో పనిచేయడం మానేశాడు.సైడ్ క్యారెక్టర్లు వస్తే తాను హీరోగా మాత్రమే చేస్తానని మొండి కేశాడు.ఆర్థిక కష్టాలు తీవ్రం కావడంతో అమ్మ నాన్న సినిమా ఇండస్ట్రీలోకి పంపించాలని అనుకుంది.

అది నాన్నకు అసలు ఇష్టం లేదు.ఆడపిల్లవి ఇండస్ట్రీలో కష్టాలు పడటం ఎందుకమ్మా అని అన్నాడు.

పరిస్థితులు బాలేవు కదా అని బదిలిస్తే నా చేతకాని తనం వల్లే ఇలా మాట్లాడుతున్నావు కదమ్మా అని బాధపడ్డాడు అని చెప్పుకొచ్చింది శ్రీలక్ష్మి.

కానీ అమ్మ మాత్రం నువ్వు నటిస్తేనే అందరం కడుపు నిండా తినగలం లేదంటే విషం తాగి చస్తాం అని మాట్లాడింది.ఇండస్ట్రీ లోకి ఎంత ఇచ్చి 41 ఏళ్లుగా రాణిస్తున్నాను.నా తమ్ముడు రాజేష్ కూడా హీరో అయ్యాడు.

ఆ రోజుల్లోనే లక్ష రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.ఎంత త్వరగా వచ్చాడో అంత త్వరగా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాడు అని తెలిపింది శ్రీలక్ష్మి.

నాకు పెళ్లయింది భర్త ఉన్నాడు కానీ ఆయన గురించి ఎవరికైనా తెలియదు చెప్పను కూడా.ఎందుకంటే తన గురించి అందరికీ తెలియడం తనకు ఇష్టం లేదు అని చెప్పకు వచ్చింది శ్రీలక్ష్మి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube