Balakrishna Chiyaan Vikram : మన హీరోలు కురూపి గా నటించి అదరగొట్టిన సినిమాలు ఇవే !

ఒక సినిమా కోసం ఎవరైనా ఎంత మేరకు మేకోవర్ చేయించుకోగలరు.

ఇటీవల కాలంలో పాత్ర కోసం బరువు తగ్గడం లేదా బరువు పెరగడం, హెయిర్ స్టైల్ మార్చడం, కాస్ట్యూమ్స్ పాత్రకి తగ్గట్టుగా వేసుకోవడం ఇంత వరకు బాగానే ఉంది.

కానీ పళ్ళు ఊడగొట్టుకోవడం 35 కిలోల వెయిట్ ట్రాన్స్ఫర్ అవ్వడం లేదా కురూపి మారిపోవడం, ప్రేక్షకులు గుర్తుపట్టలేనంత దారుణమైన మేకప్ తో నెలలకు నెలలు షూటింగ్ చేయడం వంటివి చాలా కష్టంతో కూడుకున్న పనులు.కానీ వాటిని ఎంతో ఇష్టంగా చేశారు ఒక ఇద్దరు స్టార్ హీరోలు.

అందులో మొదటి వ్యక్తి బాలకృష్ణ రెండవ వ్యక్తి విక్రమ్.వీరిద్దరూ నటిచిన చిత్రాలు బాలకృష్ణ చేసిన భైరవద్వీపం, అలాగే విక్రమ్ చేసిన ఐ మనోహరుడు.

బాలకృష్ణ - భైరవద్వీపం( Balakrishna- Bhairavadweepam )

అప్పట్లో బాలకృష్ణ 1994 లో భైరవద్వీపం అనే సినిమాలో నటించాడు.ఈ చిత్రంలో రోజా( Roja ) హీరోయిన్ గా నటించగా సినిమా మధ్యలో శాపం కారణంగా కురూపి గా మారిపోతాడు బాలకృష్ణ.అయితే అలా మారడం కోసం చాలా ఎక్కువ మోతాదులో మేకప్( Heavy Makeup ) చేయాల్సి వస్తుంది.

Advertisement

ఒక కన్ను పూర్తిగా మూసియాల్సి వస్తుంది.భారీ జుట్టు ధరించాల్సి వస్తుంది, చూడ్డానికి చాలా దరిద్రంగా తయారై జనాలను తన నటనతో మెప్పించాల్సి ఉంటుంది.

ఈ పాత్ర బాలకృష్ణ చాలా అద్భుతంగా చేశారు.కెరియర్ పిక్స్ లో ఉన్న టైంలో ఇలాంటి ఒక పాత్ర చేయడం అతనికి నిజంగా ఒక రిస్క్ అయినా కూడా సినిమా అంటే సాహసం అని నమ్మే కుటుంబంలో పుట్టాడు కాబట్టి ఆ రిస్కు చాలా ఈజీగా చేసేసాడు బాలకృష్ణ.

డూపును పెట్టి తీద్దామని దర్శకుడు చెప్పినా కూడా వినకుండా తానే ఈ పాత్రలో బాలకృష్ణ నటించడం నిజంగా అద్భుతం.

విక్రమ్ - ఐ మనోహరుడు( Chiyaan Vikram-I Manoharudu )

విక్రమ్ నటించిన ఐ సినిమా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది.ఇది 2015 లో వచ్చింది.దీనిని శంకర్( Director Shankar ) దర్శకత్వంలో తెరకెక్కించగా ఈ సినిమా కోసం విక్రమ్ పడని కష్టం అంటూ లేదు.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

చాలా దారుణమైన లుక్ కోసం గంటలు గంటలు మేకప్ వేయించుకున్నాడు.అంతే కాదు జిమ్ చేస్తూ 35 కేజీల వెయిట్ ట్రాన్స్ఫారమ్O( Weight Transformation ) అయ్యాడు.

Advertisement

పైగా ఈ సినిమా చేస్తున్న టైంలో బీస్ట్ పాత్ర కోసం రెండు పళ్ళు కూడా విరగొట్టుకున్నాడట.ఇంత హార్డ్ వర్క్ చేయడం అనేది ఇప్పటి హీరోలెవ్వరూ కూడా చేయలేరు.

సినిమా అంటే ఫ్యాషన్ అంటూ డైలాగులు చెబుతారు కానీ అలాంటి అవకాశం వచ్చిన రోజు ఏ హీరో ముందుకు రారు.కానీ విక్రమ్ అందుకు విరుద్ధం.ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలడు.

అతను చేసిన అపరిచితుడు, ఐ మనోహరుడు, బాలా దర్శకత్వంలో వచ్చిన శివ పుత్రుడు సినిమాలు అందుకు ఉదాహరణలు.

తాజా వార్తలు