సీఎం జగన్, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిలపై టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉండి మంత్రులుగా, మంచి స్నేహితులుగా ఉన్న సంగతి తెలిసిందే.
ఆ తర్వాత చంద్రబాబు నాయుడు టీడీపీలో చేరగా, వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోనే కొనసాగారు, దీంతో ఇద్దరూ రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. అయినప్పటికీ, చంద్రబాబు నాయుడు తన పాత స్నేహితుడితో ఉన్న తన అనుబంధాన్ని తరచుగా గుర్తుచేసుకుంటారు.

వీరిద్దరూ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పుటికీ అది వ్యక్తిగత పగ వరకు వెళ్ళలేదు.కానీ రాజశేఖర్ మరణం తర్వాత జగన్ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చిన తర్వాత చంద్రబాబు.జగన్ మధ్య రాజకీయ వైరం నుండి వ్యక్తిగత పగ వరకు వెళ్ళింది.ఇద్దరూ నేతలు పరప్సరంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేసుకుంటునే ఉంటున్నారు.తాజాగా జగన్ పై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. , “ జగన్ కత్తి చూపి ఆస్తులను దోచుకునే వ్యక్తి .
” అంటూ జగన్, వైఎస్‌ఆర్‌ను హెచ్చరించిస్తు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, తన కుమారుడు జగన్‌ను జాగ్రత్తగా చూసుకోవాలని వైఎస్ఆర్‌ను నాయుడు కోరారు.
అసెంబ్లీలో వైఎస్‌ఆర్‌తో తన సంభాషణను నాయుడు గుర్తు చేసుకున్నారు. “మీ కొడుకుని (జగన్) బాగా పెంచండి.
నా కొడుకు (లోకేష్) విదేశాల్లో చదువుతున్నాడు. నీ కొడుకుని కూడా విదేశాలకు పంపించావు. అతన్ని బాగా చూసుకో.” జగన్ గురించి వైఎస్‌ఆర్‌తో నాయుడు చెప్పిన మాటలు ఇవి.తాజాగా ఈ విషయంపై స్పందించిన చంద్రబాబు. జగన్ చదువు పూర్తి చేయకుండానే మధ్యలోనే తిరిగారని వ చ్చారన్నా రంటూ జగన్ పై మండిపడ్డారు.
జగన్ వ్యక్తిత్వంపైనా, పాలనపైనా చంద్రబాబు నాయుడు ఇలా దాడికి దిగారు. జగన్‌ను కార్నర్ చేయడానికి, జగన్ పరిపాలనలోని లోపాలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపించారు.