మూడోసారి గెలవాలంటే..? వాటిపైనే బీఆర్ఎస్ ఆశలు

మూడోసారి తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నారు బిఆర్ఎస్ అధినేత ,తెలంగాణ సీఎం కేసీఆర్.తాము ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాయనే నమ్మకంతో కేసీఆర్ ఉన్నారు.

 To Win For The Third Time Brs Hopes On Welfare Schemes , Bjp, Ts Politics,-TeluguStop.com

కాంగ్రెస్ , బిజెపిలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, బీఆర్ఎస్( BRS party ) తోనే అభివృద్ధి,  సంక్షేమం చోటు చేసుకుంటుందనే అభిప్రాయంతో జనాలు ఉన్నారనే నమ్మకంతో టిఆర్ఎస్ ఉంది.రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు జనాలు చూపు ఉండే విధంగా సంక్షేమ పథకాలపైనే బీఆర్ఎస్ దృష్టి సారించింది .ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి తో పాటు అనేక సంక్షేమ పథకాలతో ప్రజలను దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.అలాగే పార్టీ కార్యక్రమాలలో సంక్షేమ పథకాలను పంపిణీ అమలు చేయడం ద్వారా తమ ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది.

రాబోయే రెండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం గిరిజన వర్గాలకు పోడు భూములు, పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది.

Telugu Brs, Gruha Lakshmi, Telangana, Ts, Welfare Schemes-Politics

అలాగే గృహలక్ష్మి పథకం ( Gruha Lakshmi )కింద పేద కుటుంబాలకు మూడు లక్షల ఆర్థిక సహాయం, ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు అందించే ఏర్పాట్లు చేస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇక ఎన్నికల కోడ్ వచ్చేవరకు ఏదో ఒక సంక్షేమ పథకాన్ని ప్రకటిస్తూ నిత్యం జనాల్లో ఉండేవిధంగా కేసీఆర్( CM KCR ) ప్రయత్నాలు చేస్తున్నారు.

దీనిలో భాగంగానే జూన్ 24 నుంచి 30 వరకు అనేక జిల్లాల్లో లబ్ధిదారులకు పోడు భూముల పట్టా పంపిణీ కార్యక్రమంలో కెసిఆర్ పాల్గొనబోతున్నారు.అలాగే బీఆర్ఎస్ కు ప్రధాని ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలను ఆకట్టుకునే విధంగా, వారికి అనే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టే ఆలోచనతో ఉంది .అలాగే 2014 18 ఎన్నికలలో తమకు మద్దతుగా నిలబడిన ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ఓటు బ్యాంకు చెక్కుచెదరకుండా అనేక పథకాలను అమల్లోకి తీసుకువచ్చే ఆలోచనతో ఉంది .ఈ పథకాలే తమను మళ్ళీ గట్టిస్తాయనే నమ్మకంతో కెసిఆర్ ఉన్నారు.ఇక కాంగ్రెస్ బిజెపిలలో నెలకొన్న గ్రూపు రాజకీయాలే ఆ పార్టీలకు ఇబ్బందికరంగా మారుతాయని, అవి కూడా తమకు కలిసి వస్తాయి అని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది.అందుకే తమ పార్టీ నుంచి కీలక నేతలు ఎవరు ఇతర పార్టీల్లో చేరకుండా, ఆ సంతృప్తులను బుజ్జగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Telugu Brs, Gruha Lakshmi, Telangana, Ts, Welfare Schemes-Politics

 కాంగ్రెస్ బిజెపిల కంటే బీఆర్ఎస్ పాలన ఉంటేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందనే సంకేతాలు జనాల్లోకి వెళ్లేలా కేసిఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా సంక్షేమ పథకాలను ప్రకటించేందుకు రూపకల్పన చేస్తున్నారు .ఎన్నికలకు కేవలం కొద్ది నెలలు సమయం మాత్రమే ఉండడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచే విధంగా ఎక్కడికక్డ సభలు సమావేశాలు నిర్వహించాలని , ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు సంక్షేమ పథకాలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని , మళ్లీ బిఆర్ఎస్ పాలన వస్తేనే తమ జీవితాలు మెరుగవుతాయనే నమ్మకం జనాల్లోకి వెళ్లే విధంగా కేసీఆర్ సరికొత్త వ్యూహాలు పన్నుతున్నారు.బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభావం ఉంటుందని, జాతీయ రాజకీయాల్లో కీలకం కావచ్చు అనే  అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube