బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.గత ప్రభుత్వంలో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారని విమర్శించారు.
రాజకీయ అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్( Phone Tapping ) చేశారని భట్టి ఆరోపించారు.వ్యక్తిగత సమాచారాన్ని( Personal Information ) ఎవరికి ఇచ్చారో? ఏం చేశారో? అని పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ దేశ భద్రతకు ప్రమాదకరమని తెలిపారు.కొందరిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు.ఈ నేపథ్యంలో పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు మీకు ఎక్కడిదని ప్రశ్నించారు.వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసిన మిమ్మల్ని ఎవరూ క్షమించరని తెలిపారు.







